వేల్పూర్:

రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పలువురు రైతు నాయకులు,అభిమానులు ఘన నివాళి అర్పించారు.

వేల్పూర్ లోని స్వర్గీయ సురేందర్ రెడ్డి స్మృతివనంలో పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేల్పూర్ x రోడ్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

స్వరాష్ట్ర కాంక్షతో ఆది నుండి కేసిఆర్ గారి వెన్నంటే ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పనిచేశారని,టిఆర్ఎస్ రైతు విభాగం అధ్యక్షుడుగా ఉంటూ రైతులను సంఘటితం చేశారని ఈ సందర్బంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ రైతు బాగుకోసమే ఉండేవని,రైతులకు ఇంకా ఏదైనా చేయాలని ఆరాటపడేవారన్నారు. సీఎం కేసిఆర్ ఆశీర్వాదంతో తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తానని మంత్రి తెలిపారు.

ఈ ప్రాంత రైతుల మంచి కోసం తపన పడిన రైతు బాంధవుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారని పలువురు రైతు నాయకులు,రైతులు,ప్రజలు గుర్తు చేసుకున్నారు. తన చివరి శ్వాస వరకు రైతు సంక్షేమం కోసమే ఆరాటపడిన గొప్ప నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారని ప్రముఖ రైతునేత కోటపాటి నర్సింహనాయుడు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు రైతుల కోసం చెక్ డ్యాం లు నిర్మించి,ప్యాకేజీ 21 ద్వారా కాళేశ్వర జలాలు రప్పించి బీడు భూములను పచ్చని పైరులతో కళకళలాడెలా చేశారని పలువురు కొనియాడారు. తండ్రి ఆశయాలను తన కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయనకు ఎప్పుడూ వెన్నంటి ఉంటామని వారు పేర్కొన్నారు.

మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు,స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, రైతులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You missed