సీనియర్ల బ్లాక్ మెయిలింగ్‌తో బండి బలి..? మోడీ మెచ్చుకోవడమే బండి సంజయ్ కొంప ముంచింది…? కర్ణాటక ఫలితాలూ ఓ కారణమే.. బండికి వెల్లువలా సానుభూతి… పార్టీ ఓడిమి మూటగట్టుకునే స్థితి నుంచి బయటపడేసినట్టే….
సికింద్రాబాద్‌లో జింఖానా గ్రౌండ్‌లో కనివినీ ఎరుగనిరీతిలో జరిగిన భారీ బహిరంగ సభ బండి సంజయ్ పదవికి పొగ పెట్టిందా..? సినియర్ నాయకులు పగబట్టారా? కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేయకపోవడం పట్ల ఒత్తిడి పెరిగిందా..కవితనన్న అరెస్టు చేయండి… బండిననన్న మార్చండి అన్న సీనియర్ నాయకుల ఒత్తిడికి నరేంద్ర మోడీ సైతం తలదించవలసి వచ్చిందా.?? అవుననే అనిపిస్తుంది ఈ పరిణామాలను పరిశీలిస్తే. ఈ సభలో మోడీ మోడీ అని ఎక్కడా లేని విధంగా అనూహ్య స్పందన లభించింది. జయహో జయహో అనే నినాదాలు మిన్నంటాయి. బండి సంజయ్‌ను మోడీ అందరి ముందు వెన్ను తట్టిండు… దీంతో సభావ వేదిక వెనుక ఉన్న సీనియర్ల ముఖాలు మాడిపోయాయి.
వీడెంత.. వీని బతికెంత..? కార్పొరేటర్ స్థాయి.. అదృష్టవశాత్తు ఎంపీ అయ్యిండు… మా దురదృష్టవశాత్తు అధ్యక్షుడయ్యిండు. వీడి అనుమతి తీసుకుని ప్రెస్‌మీట్లు పెట్టాలా… బయట నుంచి వచ్చిన శక్తులన్నీ ఏకమయ్యాయి. బండి సంజయ్‌ను సాగనంపడానికి. రఘునందన్ లాంటి వ్యక్తలు కూడా ఈ శక్తులతో ఏకమయ్యాడు. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిష్టానాన్నే వీరు చాలెంజ్ చేసే స్థితికి వచ్చారు. బ్లాక్‌మెయిలింగ్ చేసేందుకు వెనుకాడలేదు. ఈటల, రాజగోపాల్‌రెడ్డి లాంటి వ్యక్తులు బండిని మార్చుడో… మేం పార్టీ నుంచి వెళ్లుడో తేల్చుకోండి అని అల్టిమేటం ఇచ్చే దాకా వచ్చింది పరిస్థితి. మొదట అర్వింద్‌తో విమర్శలు చేయించారు వ్యూహాత్మకంగా. అధ్యక్షుడైతే ఏందీ..? అతనూ ఓ కార్యకర్తనే కదా.. అనే మాటలతో బండిని చులకన చేసే ప్రయత్నం చేశారు. అర్వింద్‌ది కూడా మున్నూరుకాపు సామాజికవర్గమే కావడంతో ఆ సామాజికవర్గం నుంచే వ్యూహాత్మకంగా విమర్శల దాడి జరిగింది.
బండి సంసయ్ మరోవైపు సీనియర్లను ఖాతరు చేయకుండా ఒంటెత్తు పోకడలతో పోవడం…గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బండి సంజయ్ పాదయాత్ర కు అనుమతి లభించడం కూడా సీనియర్లకు కంటగింపుగా మారింది. ఈర్ష్య పెరిగింది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి దొరికింది. వ్యక్తిగా బండి ప్రతిష్ట పెరిగిపోవడం.. సీనియర్లను సమన్వయం చేయకపోవడం, సీనియర్లకు మర్యాద ఇవ్వలేదన్న కోపం… బండికి శాపమై వెంటాడాయి. ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకున్నారు.. కానీ అతనిది బీజేపీ డీఎన్‌ఏ కాదని వెనక్కి తగ్గారు. ఇంకా కొంత కాలం వేచి ఉండాలనే అధిష్టానవర్గం అభిప్రాయానికొచ్చింది. సీనియర్ల కళ్లలోకి బండి సంజయ్ రావడంతో అదిష్టాన వర్గం కార్యకర్తల అభీష్టానికి భిన్నంగా బండి సంజయ్‌ను పదవి నుంచి తొలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమిత్ షాకు, మోడీ కి బండిని తొలగించడం ఇష్టం లేదు వాస్తవానికి. ఈ విషయంలో వీరిద్దరూ చాలా తర్జన భర్జన పడ్డారు. కేసీఆర్ కూతరు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేసి ఉంటే.. ఈ పార్టీలో లుకలుకలు వచ్చేవి కావు. కర్ణాటక ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రాకుంటే కూడా ఈ పరిస్తితి వచ్చేది కాదు. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో సీనియర్ల బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువయ్యాయి. దీనికి బండి బలయ్యాడు.
వాస్తవంగా కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం ఇష్టం లేదు. కానీ బండిని తప్పించాలనే ఆలోచన మాత్రం ఉంది. తనకు అధ్యక్ష పదవి ఇష్టం లేకున్నా.. బండిని తప్పించేందుకు అయిష్టంగానైనా ఒప్పుకున్నాడు. బండి సంజయ్ మార్చాలన్న దానికి మద్దతు పలికిండు కానీ… ఈటల, రాజగోపాలో అయితే బాగుండు అనుకున్నాడు. కానీ ఆయనకే ఇచ్చేసింది అధిష్టానం. ఒకరకంగా ఇది బండి సంజయ్‌కు వరమే. శాపం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ చాలా బలహీన పడ్డది. సర్వేలు ఇవే చెబుతున్నాయి. పార్టీ సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్‌కు చేరేలా ఉంది. ఈ దశలో బండికి సింపతీ వస్తుంది. యువతలో అతని పట్ల సానుభూతి ఉంది. బీజేపీ సానుభూతి ఉన్నప్పుడే పక్కకు తప్పించారు. బండి ఇమేజ్ డ్యామేజ్ కాలేదు. ఈటల,రాజగోపాల్ కలుపుకోనందుకు మాత్రం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు..వాస్తవంగా వారిని నిర్లక్ష్యం చేసిందేమీలేదు. అధ్యక్ష పదవి పోవడం మూలంగా బండికి పోయిందేమీ లేదు. రేపు బీజేపీ ఘోర పరాభవం మూటగట్టుకుంటే బండికే బద్నాం వస్తుండే.. దాని నుంచి తప్పించుకున్నట్టే… ఎంపీగా గెలిచే అవకాశాలే బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర కేబినెట్‌లో బండికి చోటు కల్పించకతప్పని పరిస్థితి.