దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నికల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తున్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ .. వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే చాన్స్‌ .. రైతుబంధు పెంపు.. రైతుబీమా పెంపు… పింఛన్‌ పెంపు…… పాతవి పెంచి.. కొత్తవి సృష్టించి… బహిరంగ సభల్లోనే పార్టీల మ్యానిఫెస్టో.. ఇక ఒక్కొక్కటిగా రిలీజ్‌…పాపం బీజేపీదే ప్రేక్షకపాత్ర… మతమే అభిమతం..ఇలా అయితే కష్టం…

అటు మల్లిక్‌…. ఇటు మానాల… మధ్యలో సునీల్‌ .. బాల్కొండ టికెట్‌ కోసం సునీల్‌ ముప్పుతిప్పలు… బీజేపీలో తీవ్రంగా ట్రై చేసి… కాంగ్రెస్సే బెటరని తలచి… మానాల మోహన్‌రెడ్డి పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంటున్న అధిష్టానం… అందుకే సునీల్‌కు వెంటనే ఓకే చెప్పలేక… పెండింగ్‌లో నిర్ణయం….

పసుపురైతులు నిండా మునిగారు.. వ్యాపారుల పంట పండింది… 90 శాతం నష్టపోయిన పసుపు రైతులు… ఆరువేలకు క్వింటాలుకు అమ్మేసుకున్నారు… ఇప్పుడు ఎనిమిదివేలు పలుకుతున్న ధర… మహారాష్ట్రలో దిగుబడి లేకపోవడం.. ఇక్కడ ఈ సీజన్‌కు విస్తీర్ణం తగ్గడంతో చివరలో పెరిగిన రేటు.. కష్టం రైతులది… లాభం వ్యాపారులకు.. ఇదీ జిల్లాలో పసుపురైతుల దుస్థితి…

You missed