దాచి దాచి తీస్తున్న

పథకాల అస్త్రాలు…

ఎన్నకల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తన్న పార్టీలు…

వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు…

వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌

వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే చాన్స్‌

రైతుబంధు పెంపు.. రైతుబీమా పెంపు… పింఛన్‌ పెంపు…… పాతవి పెంచి.. కొత్తవి సృష్టించి…

బహిరంగ సభల్లోనే పార్టీల మ్యానిఫెస్టో.. ఇక ఒక్కొక్కటిగా రిలీజ్‌…

 

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీకి జీవం పోసింది.. రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టింది సంక్షేమ పథకాలు. అందుకే ఇప్పుడు అధికార పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా పథకాల మీదే దృష్టి పెట్టాయి. పథకాల అస్త్రాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నాయి. ప్రజల మనస్సులను కొల్లగొట్టి ఓట్లను గంపగుత్తగా రాబట్టుకోవాలనే యోచన చేస్తున్నాయి. దీని కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి.

వాస్తవంగా ఎన్నికలకు ముందు ఆయా పార్టీలన్నీ తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తమో చెబుతూ మ్యానిఫెస్టోను విడుదల చేస్తాయి. కానీ ఎన్నికలు ఇంకా ఐదారు నెలలుండగానే ఈ ప్రధాన పార్టీలన్నీ సీక్రెట్‌గా ఇప్పటి వరకు దాచినవి, ఆలోచించినవి, అమలు చేద్దామనుకునే పథకాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. పథకాల అస్త్రాలను బహిరంగ సభల ద్వారా మెల్లగా సంధిస్తున్నాయి. దీనికి మొదలు కేసీఆర్ ఆజ్యం పోశాడు. వాస్తవంగా కేసీఆర్‌పై ప్రజలకు గంపెడాశలున్నాయి. ప్రతిపక్షాలకు కేసీఆర్‌ ఎప్పుడు ఏం చేస్తాడోననే బుగులూ ఉంది. అయినా ఎవరికి వారు తగ్గకుండా తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకునేందుకు వ్యూహ రచన చస్తున్నాయి.

మొన్న సభలో కేసీఆర్‌ వికలాంగులకు మూడువేలుగా ఉన్న పింఛన్‌ను నాలుగు వేలకు పెంచాడు. దీంతో మొదలైంది ఇక ఎన్నికల ఆట. పథకాల వేట. వెంటనే కాంగ్రెస్‌ అలర్ట్‌ అయ్యింది. కాంగ్రెస్‌ గడిచిన జనరల్‌ ఎన్నికల్లో చాలానే హామీలిచ్చినా ప్రజలు పెద్దగా విశ్వసించలేదు. నిరుద్యోగ భృతి ఆలోచన కాంగ్రెస్‌దే. కానీ కేసీఆర్ దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రకటించాల్సి వచ్చింది. ఆయనకు ఈ పథకం పట్ల పెద్దగా ఇంట్రస్టు ఉన్నట్టుగా లేదు. అందుకే ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి వేరు. దాని హవా కొనసాగుతోంది. కర్ణాటక ఫలితాలు ఆ పార్టీ స్థితిగతులను మార్చేలా ఉన్నాయి. అక్కడి ప్రభావం ఇక్కడ కూడా చూపనుందనే ప్రచారం జోరందుకున్నది.

ఈ నేపథ్యంలో ఆదివారం ఖమ్మంలో జరిగిన రాహుల్ సభలో వృద్ధులకు, వితంతువులుకు 4వేల పింఛన్‌ను చేయూత పేరుతో అందిస్తున్నట్టు రాహుల్ నోట చెప్పించారు. మరి వికలాంగుల ఊసేత్తలేదు. వాస్తవానికి వికలాంగులకూ ఇది వర్తించాలి. కానీ కాంగ్రెస్‌ మదిలో వేరే వ్యూహం ఉంది. మరో సభలో వికలాంగులకు 5వేల పింఛన్‌ ఇస్తున్నట్టు ప్రకటించేలా వ్యూహం పన్నినట్టుగా ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. రైతుబంధు పెట్టుబడి సాయంపైనా ఇటు బీఆరెస్‌, కాంగ్రెస్‌ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎవరు మందు ప్రకటిస్తే ఆ పార్టీకన్నా ఓ రెండు వేలు ఎక్కువే ప్రకటించి ఓటర్ల మది గెలిచి ఓట్లు కొల్లగొట్టే ఆలోచనల్లో ఈ రెండు పార్టీలున్నాయి. ఇలా పథకాల వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాప్రతివ్యూహాలు…. అన్నీ కొనసాగుతున్నాయి. మ్యానిఫెస్టో ప్రకటించే నాటికి ప్రజలకు ముందే ఈ పథకాలన్నీ చెప్పేసేలా ఉన్నాయి ఈ రెండు పార్టీలు పోటీలు పడి. ఎన్నికలు ఆరు నెలల తర్వాత కాదు.. మరో నెలకే అన్న ఊపును తెస్తున్నాయి రాజకీయ పార్టీలు.

 

పాపం.. బీజేపీనే ఏ పథకమూ కొత్తగా ప్రకటించే వీలులేదు. ఇక్కడ వ్యూహాలు చేసే నాయకులు లేరు.. ఎత్తుకు పై ఎత్తులు వేసే పథకాలు రచించే లీడరూ లేడు. అంతా ఢిల్లీ పెద్దల చలవే. మా వాటా ఇది.. మీ వాటా ఇంత అని ఇంకా ఎన్నో రోజులు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎన్నకలొచ్చాయి. మాటలు కాదు చేతలు కావాలి. వాటినే జనాలు చూస్తున్నారు. పార్టీల విశ్వసనీయతా చూస్తారు..

 

You missed