డీల్ కుదిరింది..?

బాల్కొండకు సునీల్‌… ఆర్మూర్‌కు అనిల్‌….

అధిష్టానం ముందు చర్చలు కొలిక్కి… అనిల్‌ను కచ్చితగా

పద్మశాలి బీసీ బిడ్డకు టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం…

బాల్కొ్ండ వేదిక కరెక్టు కాదని యోచన.. ఆర్మూర్ నుంచి బరిలోకి దింపేందుకు రేవంత్‌ మంతనాలు..

ఇక్కడ పద్మశాలీల సంఖ్య… అధికారపార్టీపై వ్యతిరేకత… కాంగ్రెస్‌ ఊపు… ఆర్మూర్‌లో అనిల్‌ గెలుపుకు దోహదం చేస్తుందని అంచనా

 

రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మలుపుతిరుగుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ కోసం కొట్టాడుతుకున్న ఆశావహులు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ముందు క్యూ కట్టారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం గతంలో లాగా ఎవరిని పడితే వారిని తీసుకుని .. టికెట్ ఇస్తామనే హామీలు చేయడం లేదు. వారి హవా కొనసాగుతుందనే ధీమాలో ఉన్నారు. అదే సమయంలో మరింత అప్రమత్తతో ఉన్నారు. దీంతో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నేతలకు కూడా ప్రయార్టీ ఇస్తున్నారు. ఇప్పుడు పార్టీ పరపతి పెరిగిందని పోలోమంటు వస్తున్న ప్రతీ ఒక్కరికి రెడ్ కార్పెట్ కప్పడం లేదు. అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు. బాల్కొండ నుంచి సునీల్ బీజేపీ తరుపున పోటీ చేయాలనుకున్నా అక్కడ పప్పులు ఉడకలేవు. దీంతో కాంగ్రెస్‌తో కాళ్లబేరానికి వచ్చాడు. అయినా వారు వెంటనే ఓకే చెప్పలేదు. చివరకు అక్కడ అనిల్‌ అనే అభ్యర్థిని ఎటూకాకుండా చేసి మధ్యలో వచ్చిన సునీల్‌ను ఎంటర్‌టైన్ చేయడం కరెక్ట్‌ కాదనుకున్నారు. దీంతో సునీల్‌కు, అనిల్‌కు మధ్య అధిష్టానం మధ్యవర్తిత్వం కుదిర్చి డీల్‌ ఓకే చేసింది.  షరా అంతటా జరిగిదే. దీంతో ఇకపై ఈరవిత్రి అనిల్‌ ఆర్మూర్‌ వేదికగా పోరాడనున్నాడు. ఇక్కడ జీవన్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్‌ ఊపు.. పద్మశాలి ఓట్లు అన్ని కలిసి బీసీ కార్డు మీద గెలుస్తాననే ధీమాతో ఇటు అభ్యర్థి అటు అధిష్టానం ఉంది.

You missed