పసుపు రైతులకు గడ్డుకాలం వచ్చేసింది. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీ పసుపబోర్డు మాట అటకెక్కించడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. స్పైస్ బోర్డు పేరిట రీజరల్ ఆఫీసు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అర్వింద్‌… ఆ తర్వాత పసుపుబోర్డు ఊసెత్తలేదు. దీంతో వచ్చిన ధరకు పసుపు రైతులు అమ్మేసుకున్నారు. ట్రేడర్లు ఇదే మంచి అవకాశమని కొని కోల్డ్‌ స్టోరేజీల్లో నిలువపరుచుకున్నారు. ఆరువేలకు మించి క్వింటాలుకు రాలేదు. చేసిన శ్రమ మట్టిపాలయ్యింది. ఇలా దాదాపు తొంభైశాతం పసుపును అమ్మేసుకున్నారు. ఇప్పుడు ధర ఎనిమిది వేలకు పెరిగింది.దీన్ని బీజేపీ శ్రేణులు తమ ఘనతే అనే రీతిలో కూడా ప్రచారం చేసుకోవడం గమనార్హం.

అసలు విషయం ఏమిటంటే.. మహారాష్ట్రలో ఈసారి క్వాలిటీ పసుపు రాలేదు. దిగుబడి తగ్గింది. దీనికి తోడు మన దగ్గర వర్షాభావ పరిస్థితులు స్టార్టింగ్‌లో ఏర్పడ్డాయి. సీజన్‌ లేటుగా స్టార్ట్‌ అయ్యింది. విస్తీర్ణం తగ్గింది. దాదాపు ప్రతీ సీజన్‌లో 45వేల ఎకరాల్లో పసుపును సాగు చేసేవారు కానీ.. వర్షాలు లేటుగా రావడంతో దాదాపు పదివేల ఎకరాల వరకు పసుపు తగ్గిపోయింది. ఈ పంట వేయలేదు. దీంతో మార్కెట్లో చివరి నిమిషంలో రేటు పెరిగిపోయింది. ఎనిమిది వేలు.. ఆపైగా వచ్చింది. కానీ ఇది రైతులకు మేలు చేసేదేం కాదు.. ట్రేడర్లు పసుపును తక్కువ ధరకు కొనుగోలు చేసి కోల్ట్‌ స్టోరేజీల్లో బ్లాక్ చేసేసుకున్నారు. దీంతో వ్యాపారుల పంట పండింది. కష్టపడి సాగు చేసిన రైతు నిండా మునిగాడు.

You missed