ఎస్వీ క్రిష్ణారెడ్డి… ఒక ట్రెండ్‌ సెట్టర్‌. కే అచ్చిరెడ్డి నిర్మాణ సారథ్యంలో మనీషా ఫిలమ్స్‌ బ్యానర్‌నై ఎన్నో విజయవంతమైన సినిమాలు డైరెక్ట్‌ చేసి తనకంటూ ఓ ట్రెండ్‌ సృష్టించుకున్నవాడు. సంగీతంలో కొత్త బాణీలు పలికించినవాడు. చిన్నపెద్దా తేడా లేకుండా అందరి మన్ననలు పొంది అందరి ఆదరాభిమానాలు చూరగొన్నవాడు. నాగార్జున, బాలక్రిష్ట, క్రిష్ణ లాంటి పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసి మెప్పించినవాడు. కామెడీకి పెట్టింది పేరు ఆయన సినిమాలు. ఆరోగ్యకరమైన హాస్యం, వ్యంగ్యం… జంధ్యాల, ఈవీవీ తర్వాత అంతో ఇంతో మంచి సినిమాలు తీయగలడు అనిపించుకున్నవాడు. ఇదంతా ఒకప్పటి ముచ్చట.

ఆయన సినిమా శకం ముగిసి చాలా రోజులే .. కాదు ఏండ్లే అయ్యింది. ఇప్పుడంతా కొత్త ట్రెండ్‌. రాజమౌళి, సుకుమార్‌ లాంటి ట్రెండ్‌ సెట్టర్‌లా కొత్త రక్తం దూకుడు సినిమాల కాలం. ఈ తరంలో మళ్లీ అడుగు పెట్టాడు అలనాటి దిగ్విజయ దర్శకుడు క్రిష్ణారెడ్డి. బిగ్‌బాస్‌ సోహెల్‌ హీరోగా, రాజేంద్రప్రసాద్‌ మెయిన్‌ రోల్‌గా తీస్తున్న సినిమా ఆర్గానిక్‌ మామ.. హైబ్రీడ్‌ అల్లుడు. పేరే కొంచెం తికమకగా నోరు తిరగకుండా అందరికీ నచ్చేలా లేదు. పాటలూ అంతంతే. ఇక సినిమా ఎలా ఉండబోతుందో. ఇప్పటి తరం ప్రేక్షకుడి నాడి పట్టుకునేందుకు తన స్టైల్‌ ఎస్వీ మార్చుకున్నాడా..? పాత పద్దతిలోనే ముందుకెళ్లి విజయం సాధించాలనుకుంటున్నాడా..?

సినిమా రేపు రిలీజ్. ఎలా ఉంటుందో తెలియదు కానీ… పట్టుమని ౩౦ థియేటర్లలో కూడా ఈ సినిమా రిలీజ్‌ కాలేదు. అంతే మరి. ఇప్పుడు ఎస్వీ క్రిష్ణారెడ్డి ఔట్‌ డేటెడ్‌ డైరెక్టర్‌. కొత్త కుర్రహీరో. ఎలా ఉంటుందో.. ఎవరికీ పెద్దగా ఆసక్త లేదు. మధ్యలో యమలీల 2 పేరుతో మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఎస్వీ ప్రయత్నించాడు. కానీ పరమ చెత్త కథ. డైరెక్షన్‌. నాలుగు కాసుల కోసం సినిమా తీసినట్టే ఉంది. అప్పుడే అనుకున్నారు.. ఎస్వీకి సెకండ్‌ ఇన్నింగ్స్‌ కష్టమేనని. ఇగో ఇది మళ్లీ ఓ ప్రయత్నం. చూద్దాం.

You missed