ఇంట్లో ఉండే పిల్లాడు హుషారుగా గిన్నెలు, ప్లేట్ల మీద గరిటలు, చెంచాలు పెట్టీ బోల్డంత సౌండ్ వచ్చేలా వాయించేస్తూ మాంచి ఫోక్ సాంగ్స్ పాడేస్తుంటే ఇది పనికాదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి సంగీతం నేర్చుకోమని తెలిసున్న గజల్ మేష్టారి దగ్గర జాయిన్ చేశారు..
మన దేశం లో మధ్యతరగతి ,దిగువ మధ్యతరగతి తల్లితండ్రులకు ఉన్న పెద్ద టాస్క్ పిల్లల కి ఏ రంగం లో ఇంట్రెస్ట్ ఉందో గుర్తించి అందులో ప్రోత్సహించడం..ఇది చాలా మందికి అనేక కారణాలతో సాధ్యం కాదు కూడా.

బాగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం లో స్థిరపడితే చాలనే మైండ్ సెట్ మనది.అందుకే మన స్కూళ్లకు గ్రౌండ్ మనకి బ్రాడ్ మైండ్ రెండూ పెరగాలి.

చదువుకుంటూ కూడా తండ్రి కి బార్బర్ షాప్ లో సాయం చేస్తూ ,సంగీతం నేర్చుకుని ,ఇష్టమైన జానపదాలు పాడుకుంటూ, సినిమాల్లో ప్రయత్నిస్తూ “రంగా రంగా రంగస్థలాన “అంటూ రంగస్థలం సినిమాలో పాట పాడేసాడు.
బిగ్ బాస్ విన్నర్ “రాహుల్ సిప్లిగంజ్.”.

నాటు నాటు పాట ను కాలభైరవ తో కలిసి RRR లో పాడాడు..ఇప్పుడు 12 న ఆస్కార్ వేదిక పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాలభైరవ తో కలిసే.

ఇక్కడి పాతబస్తీ మంగళ హాట్ రాహుల్ ఎక్కడో ఆస్కార్ వేదిక పై మైక్ పట్టుకుని నా పాట చూడు అంటూ దంచితే మనకి సౌండ్ మామూలుగా ఉండదు.

Vydehi Murthy

You missed