బాహుబలి తర్వాత.. డైరెక్టర్ రాజమౌలి తరువాత ప్రభాస్‌ను ఓ రేంజ్‌కు తీసుకుపోయిన సినిమా లేదు. ఆ స్థాయి హిట్టూ లేదు. పాన్‌ ఇండియా హీరోగా తయారుచేసి వదిలిన రాజమౌళి తరువాత… ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేసిన దర్శకులంతా అతన్నో పిచ్చోడిని చేసి ఆడించారు. భారీ బడ్జెట్‌తో వచ్చినా ఏ సినిమాలు ప్రభాస్‌లో కండలనే నమ్ముకున్నాయి కానీ నటనను ఎవరూ పట్టించుకోలేదు. కథను గాలికొదిలేశారు. కథల ఎంపికలో వాస్తవంగా పూర్తిగా రాంగ్‌ స్టెప్స్‌ వేసింది ప్రభాసే. తాజాగా విడుదలైన సలార్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కేజీఎఫ్‌ తరహాలో ప్రభాస్‌కు మంచి హిట్టు ఇప్పటికైనా దొరుకుంతుందని అంతా భావించారు.

కానీ.. రణగొణ ధ్వనులు.. పెద్ద సౌండ్లో మసిపూసిన ముఖాలతో అందరి ముఖాలకు బొగ్గు పూసినట్టుగానే ఉంది ఈ సినిమా. మొదటి పార్టుగా వచ్చిన సలార్‌లో స్నేహం కోసం ప్రభాస్‌ ఏదైనా చేస్తాడు అనే కంటెంట్‌తో తెరకెక్కించిన డైరెక్టర్‌ అందరికీ అర్థం కాని కతను ఎంచుకుని గందరగోళానికి గురి చేశాడు. అసలు ఇద్దరి మధ్య స్నేహాన్ని బలంగా చూపించడం అటుంచి ఇలా వచ్చి అలా పోయే సీన్లకే పరిమితం చేశాడు. ఇద్దరి మధ్య శతృత్వం ఎలా వచ్చింది అనేది క్లైమాక్స్‌ వదిలేసి.. రెండో పార్టు కింద చూపించాలనుకుని.. ఇంకా గందరగోళం చేశాడు. సినిమా అయిపోయాక.. సగటు ప్రేక్షకుడికి కథ అర్థం కాక, డైలాగులు చెవికెక్కక, సీన్ల రక్తపాతం కళ్లలో తిరుగుతుండగా.. దిమ్మ దిరిగిపోయి మైండ్‌ బ్లాక్ అయిపోయి… అబ్బ ఇదెక్కడ పిచ్చి సినిమారా బాబు అని తిట్టుకోవడంతో పాటు..పాపం.. ! ప్రభాస్‌ అని ఓ నిట్టూర్పు కూడా వదులుతున్నారు.

You missed