సోషల్‌ మీడియా ప్రచారం ఎంతలా ఉంటుందంటే క్షణాల్లో అది వైరల్‌ అయిపోతున్నది. కరోనా వైరస్‌ కంటే ఘోరంగా ఇది విస్తరిస్తన్నది. మెయిన్ స్ట్రీమ్‌ మీడియా లో రాకముందే క్షణాల్లో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలపై కొత్త వార్తలు, సంచలన వార్తల పేరు మీద న్యూస్‌ వైరల్ అవుతున్నాయి. జనాలూ వాటికే అట్రాక్ట్‌ అవుతున్నారు. కానీ చాలా సందర్బాల్లో ఇవి ఫేక్‌ అని తేలినప్పుడు మాత్రం నోరెళ్లబెట్టి సోషల్‌ మీడియాను, అది రాసిన వారిని, వైరల్‌ చేసిన వారిని తిట్టుకుంటున్నారు. ఈ మధ్య బతికుండగానే చాలా మందిని సోషల్‌ మీడియా చంపేసింది. తాజాగా ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్‌రావు చనిపోయాడంటే పొద్దున్నే ఓ వార్త చక్కర్లు కొట్టింది.

అందరూ అయ్యో అనుకున్నారు. పాపం మంచి నటుడు.. ఎంత బాగా నటించేవాడు అంటూ ఎవరికి వారు ఆయన గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. తీరా చూస్తూ… కోటా బతికే ఉన్నాడు. ఆయనే స్వయంగా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఒరేయ్‌.. వెధవల్లారా..! నేను బతికే ఉన్నాన్నా… మీ చిల్లర చావు తెలివితేటలు చాలించండ్రా ..! అంటూ మీడియాకు మొట్టికాయలు కూడా వేశాడు. బతికి ఉండగానే చంపేసే సోషల్‌ మీడియాలో మాత్రం కోటా చనిపోయిన వార్త పాకిపోయింది. కోటా రిలీజ్‌ చేసిన వీడియోనే అంత త్వరగా వైరల్‌ కాదు. కాస్త సమయం పడుతుంది.

You missed