“భోళా శంకర్ ” సినిమా ప్రేక్షకులని నిరాశ పరచినట్టుగా వార్తలు వస్తున్నాయి.చిరంజీవి సినిమాని జనం ఇంకా వెంగలప్పల లాగా సినిమాను చూసి బాగోలేదని తెల్చడమే నాకర్ధం కావటం లేదు. చిరంజీవి హుందాగా రిటైరయిపోవడం ఎంతో మంచిదని నేను ఎప్పటినుండో మొత్తుకుంటున్నాను.చిరంజీవి మాత్రం తన సినీ ప్రయాణం ఎక్కడ మొదలయ్యిందో తిరిగి అక్కడకు చేరుకుని కానీ సినిమాల నుండి తప్పుకునేలా లేడు.పైగా ఈ మధ్య లేకి కామెడీ స్కిట్స్ చేసుకునే జబర్దస్త్ నటులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ( స్టేజ్ మీద ) యువ కథా నాయకిలతో అతగాడు సంభాషించే తీరును చూస్తుంటే చాలా చికాకుగా వుంటోంది.

చిరంజీవి తరం హీరోలు రజనీ, మమ్ముట్టి,మోహన్ లాల్ లు కూడా నటిస్తున్నారు కానీ వాళ్ళు ఇలా వర్ధమాన నటుడిలా సినిమాల మీద సినిమాలు చేసుకుపోడం లేదు.పైగా వారి వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు.కానీ ఇక్కడ చిరంజీవి “హ్యాపీ డేస్ ” మళ్లీ తీస్తే అందులో కూడా తమన్నా పక్కన యాక్ట్ చేసేద్దాం అని అనుకుంటున్నాడు. సో చిరంజీవి త్వరలో రిటైర్ అవ్వాలని కోరుకోవడం తప్ప మనం ఆశించింది జరిగే అవకాశం కనుచూపు మేరలో కనపడడం లేదు నాకు.

ఇక రెండోది ఈ మధ్య అతను రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది మాత్రం అభినందించదగ్గ విషయం.ఇది ప్రజాస్వామ్యం,ఇక్కడ ప్రతి పౌరుడికీ స్వేచ్చగా తన అభిప్రాయాలు వెళ్ళబుచ్చే హక్కు వుంది.పైగా చిరంజీవి కేవలం పౌరుడే కాదు,మాజీ మంత్రి,మాజీ పార్టీ అధ్యక్షుడు,సింగిల్ హ్యాండ్ తో 18 శాతం ఓట్లు సాధించిన వ్యక్తి.అలాంటి తను,ఒక్క సినిమాల విషయంలోనే కాదు యే విషయంలోనైనా ప్రభుత్వాలను సహేతుకంగా విమర్శించగల అర్హత,హక్కు రెండూ ఉన్నాయి.రాజకీయ నాయకుల దగ్గర గతంలో చేసినట్టు బానిసలా చేతులు కట్టుకుని కూర్చోకుండా అలా ప్రశ్నించడం మాత్రమే చిరంజీవి వయసుకు,అనుభవానికి తగ్గ పనులు !!!

Raghu Sreemantula

You missed