కస్టడీ.. ట్విస్టుల మీద ట్విస్టుల ఇచ్చి ఇదో సస్పెన్స్‌ భారీ యాక్షన్‌ మూవీ అనిపించుకోవాలని తీశాడు డైరెక్టర్‌ కమ్‌ రైటర్ వెంకట్ ప్రభు. కానీ కిచిడీ కథతో … కథనంలో పరమ బోర్‌గా సాగింది సినిమా. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేయాలనుకున్నాడు. కానీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి వదిలేశాడు. ఎంచుకున్న కథే కంగాళీగా ఉంది. మళ్లీ నాగ్‌ తప్పులో కాలేశాడు. మరీ ఫాల్స్‌ హిరోయిజం కథేం కాదు. అంత వరకు నయం. పాటలతో ధిమాక్‌ ఖరాబ్‌ ఏం చేయలేదు. లవ్‌ సీన్లు అతికించినట్టు..గాలికి తేలిపోయినట్టు ఉన్నాయి. కథంతా ట్విస్టులతో సస్పెన్స్‌గా కొనసాగించాలనుకున్న డైరెక్టర్.. హీరోను చాలా చోట్ల డమ్మీని చేశాడు.

ఎక్కడ సెంటిమెంట్‌ ప్లే చేయాలో తెలియక తికమక పడ్డాడు. మెయిన్ విలన్‌గా చూపిన అర్వింద్‌ సామిని చాలా చోట్ల హీరోను చేశాడు. అసలు క్యారెక్టర్‌ను సరిగ్గా తీర్చిదిద్దడంతో తప్పటడుగులు వేశాడు డైరెక్టర్‌. అంతా తమిళ వాసన. తమిళ భారీ తారాగణంతో నింపేశాడు. ఎప్పుడు ఎవరొస్తారో ఏమి ట్విస్ట్ ఇస్తారో తెలియదు. కానీ అదీ కొద్ది సేపే. మళ్లీ అదే నత్తనడక కథ. బోరింగ్ స్క్రీన్‌ ప్లే. హిరోయిన్ ఇన్ని సినిమాలు తీసినా నటనలో ఇంకా ఓనమాలు కూడా నేర్చుకోలేదు. అంత గ్లామర్‌గా కూడా ఏం లేదు. అన్నదమ్ముల సెంటిమెంట్‌ కథలో ఇరికించాడు. కానీ అది బలంగా లేదు. ఇదే సినిమాకు మెయిన్‌ రీజన్‌గా చూపడంతో ఇంతగా పడ్డ శ్రమంగా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. తమిళంలో చాలా సినిమాలే తీశాడు ఈ డైరెక్టర్‌. కానీ కస్టడీ విషయంలో ఆ సీనియారిటీ కనిపించలేదు. తప్పటడుగులే చాలా ఉన్నాయి.

అక్కినేని ఫ్యామిలీకి సరైన కథలో దొరకడం లేదో.. వీరే ఏ కథలకు సెట్‌ కావడం లేదో తెలియదు కానీ.. వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. నాగ్‌ కన్నా ఈ సినిమాలో అర్వింద్‌ సామి, శరత్‌ కుమార్‌లనే హీరోలుగా చూపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. ఆ విలన్‌ పాత్రలు ఎలివేట్‌ అయినట్టు కూడా హీరో కాలేకపోయాడు. చాలా సీన్లలో నాగ్ తేలిపోయాడు. నటన కూడా అదే పరమ రోటీనే.

You missed