Category: Entertainment

వాస్త‌వంగా చెప్పాలంటే…! అంటే.. అంటే…!! మీరేమ‌నుకున్నాస‌రే…… చెప్పేస్తున్నా…..! నేను ఓటీటీలోనే చూస్తాన‌బ్బా…! అందుకే నో రివ్యూ…! ఓన్లీ వ్యూ.. స‌రేనా….!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడెప్పుడో దిల్‌రాజు తీసిన ఎవ‌డు సినిమా మొద‌టి రోజే చూసి రివ్యూ రాయడం షురూ చేసిన‌. దిల్ రాజు తీసిన సినిమా … అదీ మావోడు.. అంటే నిజామాబాదోడు. డౌన్ టు ఎర్త్. కింది స్థాయినుంచి ఎదిగి వ‌చ్చినోడు.…

మ‌రీ ఇంత‌లా ప‌గ‌బ‌ట్టారేంట్రా బాబు…! దిల్‌రాజును వెంటాడి వేటాడుతున్న సోష‌ల్ మీడియా..!! పాపం .. రాజుకు మిగిలేది ఛేంజే అంటున్నారు… ! ఎంతైనా మ‌నోడే క‌దా.. బ‌త‌క‌నీయండి… పాపం.. ప్లీజ్‌.. ప్లీజ్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అనుకున్న‌ట్టే జ‌రుగుతున్న‌ది. జ‌రిగింది. ముందే మ‌నోళ్లు మంచి కాక‌మీదున్నారు. దిల్‌రాజు నోటిదూల తీర్చేందుకు కాచుక్కూర్చున్నారు. స‌మ‌యం రానేవ‌చ్చింది. ఇక వేట మొద‌లుపెట్టాడు. ఆ వేటాడ‌టం మాములుగా లేదు ఓ రేంజ్ లో ఉంది మ‌రి. పాపం.. మ‌న దిల్‌రాజు…

ద‌టీజ్ కింగ్ నాగార్జున్‌…! హైడ్రా పేరుతో మొద‌ట రేవంత్ బ‌లిప‌శువును చేసింది నాగ్‌నే…!! మంత్రి కొండా సురేఖ వ‌ల్గ‌ర్ మాట‌ల‌తో అక్కినేని ప‌ర‌ప‌తిని బ‌య‌ట‌కు గుంజిన కాంగ్రెస్‌..! అయినా ఆమె పై చ‌ర్య‌ల్లేవు…! నాగ్ న్యాయ పోరాటం చేసినా… ఇండ‌స్ట్రీ కోసం అన్నీ మ‌రిచీ…! అదీ కింగ్ హుందాత‌నం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌చ్చీ రాగానే టాలీవుడ్‌పై ప‌డ్డాడు రేవంత్‌రెడ్డి. మొద‌ట‌గా బ‌లిపెట్టింది నాగార్జున‌ను. వివాద‌ర‌హితుడిగా త‌న ప‌ని తాను చేసుకుపోయే త‌త్వం. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ తండ్రి చూపిన బాట‌లో సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన‌వాడు. బ‌తుకుతున్న‌వాడు. రాష్ట్రంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రిగా…

బిగ్‌బాస్‌… నాగ్‌కే కాదు.. అంద‌రికీ త‌ల‌నొప్పే…! గౌత‌మ్‌ బిగ్ బాస్ విన్న‌ర‌ట‌…! బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక‌లో రాంగ్ స్టెప్స్‌…! ఆక‌ట్టుకోని రియాల్టీ గేమ్ … అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీతో ఏకంగా ఆరుగురిని దింపిన నాగ్…! అయినా ఆక‌ట్టుకోని గేమ్‌షో…! చివ‌ర‌కు గౌత‌మ్‌ను ఎంపిక చేసి అయింద‌నిపించే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిగ్‌బాస్ త‌ల‌నొప్పికి మ‌రో రెండ్రోజుల్లో ముగింపు రానుంది. మ‌నంద‌రి కంటే నాగార్జునే ఎక్కువ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్టున్నాడు ఇదెప్పుడ‌యిపోతుందా అని. అంతటి వ‌రెస్ట్డ్ కంటెస్టెంట్ల ఎంపిక చేశారు. ఓ నెల రోజులు గుంజుకొచ్చారు. ఉహూ అది ముందుకు సాగ‌లేదు. ఏకంగా…

స‌ర్కారో ర‌క్షితి.. ర‌క్షితః..! ఇదే జ‌ర్న‌లిస్టుల కింక‌ర్త‌వ్యం…!! మ‌ళ్లోసారి గెలిపియ్యాలె..! మీకు ఇళ్ల ప‌ట్టాలు ప‌క్కా..! ఫ్యూచ‌ర్ సిటీలో మ‌న ఫ్యూచ‌ర్‌కు ఢోకా ఉండ‌దోయ్ మ‌రి..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల కింక‌ర్త‌వ్యం కాంగ్రెస్ స‌ర్కార్‌ను కాపాడుకోవ‌డం. ఈ ప్ర‌భుత్వాన్ని కాపాడుకుంటేనే ఇక ఫ్యూచ‌ర్ అన్న‌మాట‌. ఫ్యూచ‌ర్ సిటీనా వాలో మ‌న‌కో జాగా ప‌క్కాగా బుక్క‌యి ఉంటుంద‌న్న‌మాట‌. అవును రేవంత్ చెప్పిన మాట ఇదే. ఇచ్చిన హామీ ఇంచుమించు…

బిగ్‌బాస్‌కు వైల్డ్‌కార్డు ఎంట్రీల‌తో జాకీలు..! బోరింగ్ గేమ్ షోకు బూస్టింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం.. మ‌రో ఎనిమిది మంది పాత కంటెస్టెంట్ల‌తో హౌజ్‌ను నింపిన నాగ్‌…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఆరు వారాల పాటు ప‌ర‌మ బోరింగ్‌గా సాగిన బిగ్‌బాసుకు వైల్డ్ కార్డు ఎంట్రీతో జాకీలు పెట్టి లేపే ప్ర‌య‌త్నం చేశాడు నాగ్‌. అవును.. ఈసారి కంటెంస్టెంట్ల ఎంపిక చెత్త‌గా ఉంది. అందుకే ఆది నుంచే…

క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్ప‌ట‌డుగులు..! క‌డుపులో దేవుతున్న స్వ‌యంపాకం.. !!

తెలుగులో క‌థ‌లు దొర‌క‌డం లేదు బ‌హుశా. మ‌న‌వాళ్ల అతి విశ్వాస‌మో.. ప్రేక్ష‌కుల‌పై చిన్న‌చూపో తెలియ‌దు కానీ, హీరోయిక్ పాత్ర‌ల కోసం క‌థ‌ల‌ను అలాగే రాసుకుని ఇలా త‌మ భ‌విష్య‌త్తును కాల‌రాసుకుంటున్నారు. ఓ పూరీ, ఓ వినాయ‌క్‌, ఓ శ్రీ‌ను వైట్ల‌, ఓ…

పాపం.. నాగార్జున‌..! బిగ్‌బాస్‌కు అంత సీన్ లేదు..! హౌజ్‌లోకి వ‌చ్చేందుకు పెద్ద స్టార్లు దూరం..!! కొత్త ముఖాలు… పెద‌వి విరిచిన ప్రేక్ష‌కులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాపం.. నాగార్జున‌..! వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లే ఉన్న‌ట్టున్నాయి. హైడ్రా పేరుతో ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేసింది ప్ర‌భుత్వం. ఇది ఊహించ‌ని ప‌రిణామం నాగ్‌కు. తేలు కుట్టిన దొంగ‌లాగే అయ్యింద‌నుకో ఈ విష‌యంలో. అక్ర‌మ‌మ‌ని చెప్ప‌లేడు. స‌క్ర‌మ‌మ‌నీ కితాబిచ్చుకోలేడు. జనాల నుంచి కూడా…

మహిళలపై వేధింపులు మలయాళ పరిశ్రమలోనే కాదు.. !! తమిళం, తెలుగు ఇండస్ట్రీలలోనూ ఉన్నాయి: నటి షకీలా..!

వాస్త‌వం ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై నటి షకీలా స్పందించారు. మహిళలపై వేధింపులు మలయాళ పరిశ్రమలోనే కాదు.. తమిళం, తెలుగు ఇండస్ట్రీలలోనూ ఉన్నాయని అన్నారు. “ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా కనిపిస్తారు. మొదట్లోనే తాము అలాంటి…

పాపం..ప్రభాస్‌..! డైరెక్టర్ల చేతిలో ఓ పిచ్చోడు… కథల ఎంపిక విషయంలో బాహుబలి తర్వాత పూర్తిగా రాంగ్‌ స్టెప్స్‌…

బాహుబలి తర్వాత.. డైరెక్టర్ రాజమౌలి తరువాత ప్రభాస్‌ను ఓ రేంజ్‌కు తీసుకుపోయిన సినిమా లేదు. ఆ స్థాయి హిట్టూ లేదు. పాన్‌ ఇండియా హీరోగా తయారుచేసి వదిలిన రాజమౌళి తరువాత… ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేసిన దర్శకులంతా అతన్నో పిచ్చోడిని చేసి ఆడించారు.…

You missed