మట్టిలో మాణిక్యాలు వీరు… చదివేది ప్రభుత్వ సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలో. చదివేది ఎక్కడైతే ఏందీ..? వారిలో టాలెంట్‌ను బయటకు తీసింది ఈ ప్రభుత్వ విద్య. పన్నెండు మంది విద్యార్థులు… ఒక్కొక్కరు ఒక్కో కాన్సెప్ట్‌ ఎంచుకున్నారు. అప్పుడప్పుడే అక్షరాలను ఏర్చికూర్చడం నేర్చకున్న వీరు.. ఏకంగా నవల రాసేందుకు సిద్దమయ్యారు. రాసేశారు. తమ అనుకున్నదానికి అక్షర రూపమిచ్చారు.

ఒక్కొక్కరు ఒక్కో నవలా. పన్నెండు మంది విద్యార్థినిలు.. పన్నెండు నవలలు. ఈ విద్యార్థులంతా ఇందూరుకు చెందిన వారే.
నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినులే కావడం గమనార్హం. ఈ పన్నెండు మంది రాసిన నవలలు హైదరాబాద్‌లో నిర్వహించిన బుక్‌ఫెయిర్‌లో తమ పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన పుస్తక ప్రియులు, రచయితలు వీరి నవలలు చూసి అబ్బురపడ్డారు. చేయి తిరిగిన, ఎంతో అనుభవం ఉన్న రచయితలు రాసిన మాదరిగా ఒక్కొక్కరూ ఒక్కో ఇతివృత్తాన్ని ఎంచుకుని చక్కగా,పొందికగా, ఆసాంతం చదివించే విధంగా నవలలు రాశారని మెచ్చుకున్నారు.
వారు రాసిన నవలలు ఇవీ…

రెసిడెన్షియల్ పాఠశాలలు,కళాశాలలు కేసిఆర్ గారి మానస పుత్రికలు

పేద పిల్లలకు ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య అందాలనేది ఆయన ఆశయం

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్:

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్ లో జరుగుతున్న “హైదరాబాద్ బుక్ ఫెయిర్” ఎగ్జిబిషన్ లో 38వ నంబర్ స్టాల్ లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారు రాసిన పుస్తకాలు చూసి వారి ప్రతిభను మెచ్చుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు,కళాశాలలు కేసిఆర్ గారి మానస పుత్రికలన్నారు. 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు,ఇంటర్ కాలేజీలు,డిగ్రీ కాలేజీలు నెలకొల్పారని అన్నారు. ఆడపిల్లలు చదువుకు ఇబ్బంది కాకూడదని ఇంటర్,డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు కొత్తగా నెలకొల్పారని విద్యార్థులతో చెప్పారు.పేద పిల్లలకు ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య అందాలనేది ఆయన ఆశయమని తెలిపారు. వారికి కాలేజీలో అందుతున్న విద్య,వసతిపై ఆరా తీశారు. భవిష్యత్ లో మరింత రాణించాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినిల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించిన ఇంగ్లీష్ లెక్చరర్ సంధ్య దీప్తిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్బంగా మంత్రి ఇంట్లోనే విద్యార్థినులకు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు,డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

You missed