వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పద్దతులు మారాయి. చెప్పే విధానం మారింది. హెడ్డింగ్‌ షాకింగ్‌గా ఉండాలి. అప్పుడే అది బ్రేకింగ్‌ అవుతుంది. నలుగురినీ చదివిస్తుంది. చప్పటి వార్తలు ఎవడికి కావాలి. మసాలా జోడించాలి. ఆసక్తి పేరుతో మమనే కొంచెం సంచలనం టచ్‌ ఇవ్వాలి. వార్తను చదివించగలిగాలి. లోన మ్యాటర్‌ లేకున్నా సరే… పైన పెట్టిన హెడ్డింగ్‌కు సూట్‌ కాకున్నా సరే… టైటిల్‌ అదరాలి. దీని కోసం ఏమైనా చేయాలి.

ఇగో అలాగే ఉంటుంది మన మీడియా. పాపం దీని కోసం ఎన్ని తిప్పలు పడుతుందో కదా..! మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కొంత సంయమనం పాటిస్తున్నా….డిజిటల్‌ మీడియా, యూట్యూబ్‌ వార్తలు…. వెబ్‌ సైట్లు… వీటివన్నీ ఇంచుమించూ ఇదే దారి. ఇదే జనానికి నచ్చుతుందని అనుకుంటున్నారో…. ఇలాగైతేనే నలుగురిని చదివిస్తుందని అనుకుంటున్నారో తెలియదు కానీ… నవ్వులపాలైతే అవుతున్నాయి. వింత పోకడల విధానాలు రోత పుట్టిస్తున్నాయి.

You missed