నమస్తే తెలంగాణలోని వార్త ఇది. మొన్న పీవీ వర్దంతి సందర్బంగా వచ్చినది. నివాళులర్పించింది బీఆరెస్‌ నాయకులు.. అందులో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, పీవీ తనయ, ఎమ్మెల్సీ శ్రీవాణి కూడా ఉన్నారు. కానీ ఈ ఫోటో కింద ఉన్న రైటప్‌ మాత్రం కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించినట్టుగా.. ఇంకా చాలదన్నట్టు కాంగ్రెస్‌ నాయకుల పేర్లూ పెట్టేశారు.ఇది కాస్త సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లింది. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఎడాపెడా అర్సుకున్నాడు నమస్తే తెలంగాణ పెద్దలను.

ఇప్పటికే అక్కడ ఎడిటర్‌ వ్యవహారంతో ఆయన చికాకుగా ఉన్నాడు. అంతా రాజీనామా బాటలో ఉన్నారు. చేస్తున్నారు. ఇంకా లైన్లో ఉన్నారు. కీలకమైన సెంట్రల్‌ డెస్క్‌లో ఇప్పుడు ఎవరూ ఇంచార్జిలు లేరు. మొన్ననే జగన్‌ రాజీనామా చేసేశాడు. నిన్న నేషనల్‌ డెస్క్‌ చూసుకునే రాజశేఖర్‌ గుడ్ బై చెప్పాడు. అంతా బయటకు వెళ్లిపోతున్నారు. ఓ వార్త రిపోర్టర్‌ రాసిస్తే దాన్ని క్షుణ్ణంగా చదివి, సరైన వివరాలున్నాయో లేవో చూసుకుని,తప్పొప్పులు సరిచేసుకుని, ఫోటో ఎంచుకుని, దానికి తగిన రైటప్‌ పెట్టుకుని ఇవ్వాల్సింది సెంట్రల్‌ డెస్క్‌. ఆ డెస్కలోని సబ్‌ ఎడిటర్‌ ఈ పనిచేసిన తర్వాత దాన్ని సరిచూసుకుని ఫైనల్ చేసేది సెంట్రల్‌ డెస్క్‌ ఇంచార్జి. ఆఖరికి ఎడిటర్‌. కానీ ఇక్కడ ఎవరికి ఎవరి పట్ల అజమాయిషీ లేదు. బాధ్యత లేదు. సీరియస్‌ నెస్‌ తగ్గింది. పట్టించుకునే వారు లేరు. ఏ వార్త ఎవరు ఎలా ఇస్తున్నారో..? ఎలా పెడుతున్నారో..? చూసేవారు లేరు.

ఇలా ఎడిటర్‌ చేష్టల వల్ల తప్పుల కుప్పగా, తలనొప్పి వ్యవహారంగా నమస్తే తెలంగాణ తీరు మారింది. ఇది ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దృష్టికి వచ్చింది. మొన్నటి ఈ తప్పుడు వార్త ఆయన కోపాన్ని మరింత పెంచింది. ఎడాపెడా చెడామడా తిట్టిపోశాడు. ఇక చర్యలు తీసుకోవదడమే తరువాయి. పంతుళ్లను సాగనంపడమే మిగిలివుంది. ఏరికోరి కేసీయారే వీరిని తెచ్చిపెట్టుకున్నాడు. ఇ ప్పుడు కొరివితో తలగోక్కున్నంత పనైందని బాధపడుతున్నాడు. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. చాలా మంది దీన్ని నమ్ముకున్నవాళ్లంతా ఉద్యోగం వదిలేసి రోడ్డున పడ్డారు. ఏదో ఒక పనిచేసుకుంటున్నారు. ఎవరినో ఎవరెవరినో తెచ్చి లక్షల జీతాలిచ్చి కులానికి ప్రాధాన్యత ఇచ్చి ఇలా పెంట పెంట చేసేసి వదిలేశారు పంతుళ్లు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకున్నా… చేసిన తప్పులు, పాపాలు ఊరికేపోవు. అవి వెంటాడుతూనే ఉంటాయి.

You missed