ఎమ్మెల్సీ కవిత తొలిసారి షర్మిలపై స్పందించారు. వైఎస్ఆర్‌ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కొందరు షర్మిలపై దాడిని సమర్థించారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం తిట్ల దండకం అందుకుంటున్న షర్మిలకు ఇది తగిన శాస్తే అని కొందరంటే… ఈ దాడి సరికాదని కొన్ని పక్షాలు వ్యతిరేకించాయి. బీజేపీ మాత్రం షర్మిలకు తోడుగా నిలిచింది. దీనిపైనా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు మరింత చర్చకు తెర తీసింది. బీజేపీ వదిలిన బాణం షర్మిల అని ఆమె పరోక్షంగా అర్థం వచ్చేలా తన ట్విట్టర్లో స్పందించారు.బీజేపీ వదిలిన బాణం.. తాన అంటే తందాన అంటున్నారని అన్నారు.

బీజేపీని తామర పువ్వులు అని సంబోధించడం మరింత వివాదస్పదమయ్యింది. చర్చకు తెర తీసింది. ఆమె రాసింది మూడే లైన్లు. కానీ ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపుతోంది. మొన్న అర్వింద్‌పై చెప్పుతో కొడతా అని ఆమె వార్నింగ్‌ ఇవ్వడం కూడా బీజేపీలో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఆమె ఇప్పటి వరకు చాలా విషయాల్లో మౌనంగానే ఉన్నారు. బీజేపీ పై కేటీఆర్‌ చాలా సార్లు స్పందించినా.. కవిత మౌనాన్నే ఆశ్రయించారు. కానీ ఇప్పుడామె ట్రెండ్‌ మార్చారు. విరుచుకుపడుతున్నారు. తన శైలికి భిన్నంగా పోతున్నారు. వార్నింగ్‌లు ఇస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షాల్లో ఈ వైఖరి చర్చనీయాంశమవుతుండగా… టీఆరెస్‌లో మాత్రం కొత్త జోష్‌ను నింపుతోంది.

You missed