ఎమ్మెల్సీ కవిత షర్మిలపై ఎటాక్‌ కొనసాగిస్తున్నారు. షర్మిలపై దాడి జరిగిన తర్వాత బీజేపీ స్పందించిన తీరుతో… బీజేపీ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని తేల్చిపారేశారు ట్టిట్టర్‌ వేదికగా కవిత. ఆమె అలా స్పందించారో లేదో…. ఇదే అవకాశమని షర్మిలా అందుకున్నది. కవితను పాదయాత్ర చేశావా..? పోరాటాలు చేశావా…? కవితలు మాత్రం బాగా చెప్తున్నావ్‌ అంటూ రెచ్చగొట్టింది. ఇక్కడే కవిత సంయమనం పాటించాల్సింది. కానీ ఆమే గట్టి కౌంటరే ఇచ్చారు. ఇలా. ఇంతలా షర్మిల గురించి ఆయాసపడటం శుద్ద దండుగ. ఆమెను పట్టించుకున్నవారు లేరు. బీజేపీ సపోర్టుగా ఆమె రావొచ్చు. కేసీఆర్‌ను ప్రభుత్వాన్ని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నది కావొచ్చు.

కానీ జనం మధ్య ఆమెకున్న ఆదరణ ఎంత..? ఎవరు పట్టించుకుంటున్నారు. ఆమె పట్ల ప్రజల విశ్వాసం ఎంతుంది..? రేపు ఎన్నికల్లోష ఎన్ని ఓట్లు పడతాయి..? అని ఒక్కసారి ఆలోచిస్తే. షర్మిలకు అంత సీన్‌ లేదని ఇట్టే తెలిసిపోతుంది. క్రిష్టియన్ల ఓట్లు, రెడ్ల ఓట్లు , రాజశేఖర్‌ రెడ్డిపై అభిమానం అంటూ కొన్ని వార్తలు మీడియాలో వచ్చాయి. వారంతా మూటగట్టుకుని షర్మిల పార్టీకి వేస్తారని లెక్కలు వేశాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆమెకంత సీన్‌ లేదు. ఆమెను పట్టించుకున్నవారూ లేరు. ఆమె ప్రచారం ఆమెను చేసుకోనీయకుండా దాడులు చేసి హైలెట్ చేసింది మీరే. ఇప్పుడు ట్విట్టర్‌ వేదికగా తిట్ల దండకం, సెటైర్ల పరంపర కొనసాగితే వారిది పోయేదేమీ లేదు. మనమే కొన్ని మెట్లు దిగుతున్నాం. ఆమె మరింత హైలెట్‌ అవుతోంది. ఈ లాజిక్‌ కవిత తెలుసుకుంటే బాగుండు..

You missed