బీజేపీ గెలుపు కోసం అడ్డదారులన్నీ తొక్కుతున్నది. ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిలువరించగలిగింది. మహిళల చేతులపై పువ్వు గుర్తును వేసి రేపు వారంతా టీఆరెస్‌కు ఓటేయడానికి వచ్చినప్పుడు ఈ కారణంతో ఓటేయ్యకుండా చేయాలనే ఎత్తుగడ ఒకటి నడుస్తోంది. ఇది చాలదంటూ … కాంగ్రెస్ చేతులెత్తేసిందనే ప్రచారానికి పూనుకున్నది. వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ రోజు రోజుకూ పుంజుకుంటూ వస్తున్నది. దాని ఓటు బ్యాంకు బలంగా ఉంది. అది రెండో స్తానంలో ఉంది. బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది.
కానీ అబద్దాలతో గెలుపు తీరాలకు చేరాలని చూస్తున్న బీజేపీ అన్నీ అడ్డదారులు తొక్కుతున్నది. ఇందులో ప్రధానంగా ఇప్పుడిది కాంగ్రెస్‌ను వాడుకోవాలని చూస్తున్నది. హుజురాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీగా ఉండిపోయింది. అందుకే అక్కడ బీజేపీ గెలుపు తీరాలకు చేరింది. టీఆరెస్ ఓటు బ్యాంకులో అయోమయానికి సృష్టించాలని బీజేపీ భావిస్తుంది. కానీ చెక్కుచెదరని ఓటు బ్యాంకు అక్కడ టీఆరెస్‌కు సొంతం. కేసీఆర్ సభతో మరింత జోష్ పెరిగింది గులాబీ దళంలో. టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం లో బీజేపీని దుమ్ము రేగేలా ఉతికారేసిన కేసీఆర్.. రాజగోపాల్ రెడ్డిని గాడిదగా సంబోధించాడు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా.. అని ఓటర్లకు అర్థమయ్యేలా కేసీఆర్ మాట్లాడిత తీరుతో ఓటర్లంతా మరింత చైతన్యవంతులయ్యారు.