ఒకవైపు దొంగస్వాముల ఆడియో టేపులతో దేశం మొత్తం దద్దరిల్లుతుంటే బండి సంజయ్ అనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రమాణం చెయ్యడానికి యాదాద్రికి రమ్మని కేసీఆర్ కు సవాలు విసురుతాడు!

ఇక కిషన్ రెడ్డి అనే అమాయక చక్రవర్తి నాలుగు వందలకోట్లు బీజేపీ దగ్గర ఎక్కడున్నాయి? అని పరమ చాదస్తంగా ప్రశ్నిస్తాడు!

వీరి మాటలు విన్నతరువాత ఆ దొంగస్వాములు చెప్పినట్లు సంజయ్, కిషన్ రెడ్డి నిజంగా వేస్ట్ గాళ్ళే (ఇది స్వాములోరు నుడివిన మాటండోయ్!).

ఆ టేపుల సారాంశం విన్నవారికి అర్ధమయ్యేది ఒక్కటే…కేసీఆర్ అనే ఒక నాయకుడు, పాలకుడు లేకపోతె తెలంగాణ ప్రాంతం ముక్కలు చక్కలు కావడమే కాదు..కచ్చితంగా మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది.

ఆ దొంగస్వాముల నాటకాల వెనుక సూత్రధారులు ఎవరో అందరికీ తెలుసు. మోడీ, అమిత్ షా అని ఆ దొంగభడవలే వారి నోళ్లతో వారే చెప్పారు. బీ ఎల్ సంతోష్ అనే ఆరెస్సెస్ కార్యదర్శి ఇంటికి ఆ నంబర్ వన్ నంబర్ టు లు స్వయంగా వెళ్లారంటే ఆ సంతోష్ అనే నాయకుడు ఎంతటి పవర్ఫుల్లో అర్ధం చేసుకోవచ్చు.

ఆ టేపులను ఫోరెన్సిక్ లాబ్ కు పంపించారు పోలీసులు. ఆ వాయిస్ నిజమైనదో కాదో తెలిసిపోతుంది.

ఒకటిమాత్రం నిజం. రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకోవడానికి కేసీఆర్ అనే వ్యక్తి ఎన్టీఆర్ కాదు. ఎదురుతిరిగి పొట్టలో కొమ్ములతో పొడిచి పేగులు చీల్చే పొట్టేలు బాపతు.

ఒక దుర్మార్గాన్ని, ప్రజాస్వామ్యహత్యను సమర్ధవంతంగా నివారించిన ప్రజానేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వందల కోట్లు ఎరవేసినా ప్రలోభపడకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి బీజేపీ ఆగడాలకు కళ్లెం వేసిన ఆ ఎమ్మెల్యేలకు అభినందనలు.

ఈ టేపులు బయట పడ్డప్పటినుంచి బీజేపీ నేతల ముఖాల్లో నెత్తురుచుక్క లేదని స్పష్టంగా తెలిసిపోతున్నది.

యుద్ధనీతి తెలిసిన సైన్యాధికారి ఎవరైనా తన వ్యూహాతంత్రాలను ఒకేసారి బయటపెట్టరు. అవసరాన్ని బట్టి ఆయుధాలను ప్రయోగిస్తారు.

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయమై మొదట్లో సాక్ష్యాలు లేవని బీజేపీ నాయకులు బుకాయించారు. వాళ్ళతో మాకు సంబంధం లేదన్నారు. దాంతో పోలీసులు ఆడియో టేపులు విడుదల చేశారు. అవన్నీ మిమిక్రి అని కొట్టేస్తున్నారు బీజేపీ వాళ్ళు.

ఇవాళో రేపో మరిన్ని ఆడియో టేపులు విడుదల అవుతాయట. అంతే కాదు…బీజేపీ దొంగస్వాముల వ్యవహారాన్ని సుమారు అరవై సీసీ కెమెరాల్లో చిత్రించారని, అవన్నీ విడతలవారీగా విడుదల చేస్తారని సమాచారం.

ముర‌ళీమోహ‌న రావు ఇల‌పావులూరి

You missed