రోడ్డు రోల‌ర్ గుర్తుతో కారుకు పెద్ద డ్యామేజీ జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి టీఆరెస్ మొత్తుకంటూ వ‌స్తున్న‌ది. కానీ అంత‌కు మించి ప్ర‌మాదం సైలెంటుగా ఏనుగుతో జ‌ర‌గ‌నుంది. అవును వాస్త‌వం స‌ర్వేలో ఈ అంశం కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఈవీఎంల‌లో మొద‌ట ఉన్న‌ది బీఎస్పీ గుర్త ఏనుగు. ఆ త‌ర్వాత కారు గుర్తు. టీఆరెస్ ఇన్చార్జిలు కొంత మంది రోడ్డు రోల‌ర్ గుర్తుతో ఓట‌ర్లు క‌న్ఫ్యూజ్ అవుతార‌ని డూప్లికేట్ ఈవీఎం చూపుతూ రెండో స్థానం గుర్తు కారును చూపిస్తూ కారుకే ఓటేయాల‌ని చెబుతున్నారు.

కానీ ఇది అంత‌టా జ‌ర‌గలేదు. చాలా గ్రామాల్లో వృద్దులు, న‌డి వ‌య‌స్సు వాళ్లు కారుకే ఓటేసేందుకు రెడీ గా ఉన్నారు. అయితే మొద‌ట ఉన్న ఏనుగుకు వేసే అవకాశాలు లేక‌పోలేదు. దీంతో ఎక్క‌డో ఉన్న రోడ్డు రోల‌ర్ గుర్తుకు ఏం ప‌డ‌తాయో ఓట్లు గానీ, మొద‌టి స్థానంలో ఉన్న ఏనుగుకు మాత్రం అయోమ‌యంలో చాలా మంది గుద్దేసేలా ఉన్నారు. ఈ లెక్క‌న కారును ఏనుగు సైలెంటుగా గుద్ది పారేస్తుంద‌న్న‌మాట‌. దీనిపై టీఆరెస్ శ్రేణులు జాగ్ర‌త్త‌లు తీసుకుని అవ‌గాహ‌న ప‌ర్చ‌క‌పోతే ఆయాచితంగా ఏనుగుకు.. కారుకు ప‌డే ఓట్లు ప‌డేలా ఉన్నాయ‌నేది వాస్త‌వం.

You missed