మునుగోడు ఉప ఎన్నిక ఏమో గానీ… రాజ‌గోపాల్ రెడ్డికి ఎప్ప‌టికీ.. జీవితాంతం గుర్తండేలా ఆడోళ్లు మాత్రం శాప‌నార్దాలు పెడుతున్నారు. ఈ ఉప ఎన్నిక రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ‌ల్ల వ‌చ్చింది… ఎందుకు రాజీనామా చేసిండు..? ఎవ‌ని కోసం చేసిండు..?? ఆని కోసం కాదా..? ఇప్పుడాడు గెలుస్తందుకు మా పిల్ల‌ల్ని, మొగ‌ళ్ల‌ని తాగుబోతుల్ని చేసిండు.. ఆనింట్ల మ‌న్నువ‌డ అంటూ శాపాలు పెడుతున్నారు. కారాలు, మిరియాలు నూరుతున్నారు. మునుగోడులో ఏ మండ‌లం పోయినా.. ఏ గ్రామానికి పోయినా మ‌హిళ‌ల నుంచి ఇలాంటి మాట‌లు వినిపిస్తున్నాయి.

కొంత మంది యూత్ కూడా బీజేపీ మొత్తం పోర‌గాళ్ల‌ను ఆగం చేసింద‌ని మొత్తుకుంటున్నారు. ఇదివ‌ర‌కు ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ చూడ‌లే .. ఆళ్ల రాజ‌కీయాల కోసం మా పోర‌ల‌ను ఆగం చేసుడేంది..? ఈ ఎన్నిక‌ల‌యినంగ ఆళ్లు తిరిగి ప‌నులు చేసుకంట‌రా..? తాగుకుంట కూసుంట‌రా..? వాళ్ల సంసారాలేమి గాను..?? అని ముఖం మీదే రాజ‌గోపాల్ రెడ్డిని తూర్పార‌బడుతున్నారు. తుపుక్‌మ‌ని ఉమ్మేసినంత ప‌నిచేస్తున్న‌రు. ఏనాడైనా ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు వ‌చ్చి ప‌ల‌క‌రించ‌నోడు… ప‌ట్టించుకోనుడు.. ఇయాళ త‌న కోసం రాజీనామా చేసుకుని మ‌మ్మ‌ల్నంద‌రినీ ఆగం చేస్తుండు.. అని మ‌హిళా లోకం దుమ్మెత్తిపోస్తున్న‌ది. మా ఉసురు త‌ల్గ‌క మాన‌ద‌ని శాపాలు కోపాలు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

You missed