చౌటుప్పల్:

చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామంలో టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్,మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…

మునుగోడు ఉప ఎన్నిక రాజ గోపాల్ రెడ్డి స్వార్దం కోసం వచ్చిందన్నారు. 18 వేల కోట్ల తన సొంత కాంట్రాక్ట్ కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ వ్యాపారులకు తాకట్టు పెట్టాడని విమర్శించారు. కేసిఆర్ ఏమో పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10వేలు, దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే 5లక్షల రైతు భీమా,24 గంటల ఉచిత విద్యుత్,ఆడబిడ్డ పెళ్లి అయితే 1లక్ష రూపాయలు,కేసిఆర్ కిట్ తో పాటు 12వేలు ఆడబిడ్డ పుడితే 13 వేలు,2వేలు,3వేలు ఆసరా పెన్షన్లు ఇట్లా కేసిఆర్ ప్రజల జేబులు నింపుతుంటే – బీజేపీ నరేంద్ర మోడీ పెట్రోల్,డీజిల్,గ్యాస్ సిలిండర్,ఉప్పు ,పప్పు, కారం నిత్యావసరాలతో సహా అన్ని రకాల ధరలు పెంచి ప్రజల జేబుల పైసలు గుంజుకుంటున్నడు అని మండిపడ్డారు.

పువ్వు గుర్తు మోడీ ప్రధాని అయిన తర్వాత పెట్రోల్ 60 ఉంటే 110 రూ. డీజిల్ 40 ఉంటే 100రూ. గ్యాస్ సిలిండర్ 410 ఉంటే ఇప్పుడు 1200 రూ. అయ్యాయని ఇట్లా అన్ని రకాల ధరలు పెరిగాయని మండిపడ్డారు.ఈ పెరిగిన ధరలతో ఎంత అవస్థ పడుతున్నమో మహిళలు ఆలోచన చేయాలన్నారు. పువ్వు గుర్తు బీజేపీ పార్టీ వాళ్ళు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నరని మండిపడ్డారు. వాళ్లకు ఓటు వేస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకారం తెలిపినట్టే అవుతుందని రైతులు ఆలోచన చేయాలని కోరారు. ఇప్పుడు అట్లాంటి బీజేపీ పంపిన రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నాడని,.నాలుగు ఏళ్లుగా ఏమీ చేయనోడు ఇప్పుడు ఏమి చేస్తాడని ప్రశ్నించారు.

డి. నాగారం గ్రామంలో తన దృష్టికి వచ్చిన సమస్యలు,కొయ్యలగూడెం నుంచి రోడ్డు, సంఘ భవనాలు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేసిఆర్ పంపిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మునుగోడు ను అభివృద్ది చేసుకుందామని ఓటర్లకు పిలుపునిచ్చారు. యువకులు ఆలోచన చేయాలని రెచ్చగొట్టే బీజేపీ మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న కేసిఆర్ ప్రభుత్వం మునుగోడును అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. టీఎర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

You missed