జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే లో ఈ నిజం నిగ్గు తేలింద‌ట‌… తెలుగు రాష్ట్రాలంటూ ఏదో చెప్పారు కానీ.. ఇక్క‌డా అక్క‌డా అని కాదు.. అంత‌టా అక్ర‌మ సంబంధాలు వ‌ర్దిల్లుతున్నాయి. దిన‌దినాభివృద్ది చెందుతున్నాయి. కుటుంబాలు చిన్నాభిన్న‌మ‌వుతున్నాయి. కాపురాలు చెల్లాచెద‌ర‌వుతున్నాయి. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌లు ఇందులో భాగ‌మైపోతున్నాయి. ఇదెవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. కానీ ఒక్క‌రికి ముగ్గురున్నారా..? న‌లుగురున్నారా… ? అదీ తెలంగాణ‌లో ఐతే ఇలా.. ఆంధ్ర‌లో అయితే ఇలా.. అని స‌రిగ్గా లెక్క‌లేసిన‌ట్టు స‌ర్వే చెప్ప‌డం శుద్ద‌త‌ప్పు. అంద‌రినీ ఒక్క గాట‌న క‌ట్టి.. అంతా ఇంతే. అందరూ అక్ర‌మ సంబంధాలు నెరుపుతున్న‌వారే అని తేల్చ‌డం కూడా స‌ర్వే ప‌ని కాదు. అది స‌ర్వేనే కాదు.

కానీ ఒక్క‌టి మాత్రం నిజం. టెక్నాల‌జీ పేరుతో ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ విరివిగా వాడ‌కం మొద‌లై, త్రీజీలు, ఫోర్‌జీలు ఉచితండా డేటాల డేటాలు అందుబాటులోకి వ‌చ్చిన నాటి నుంచి కుటుంబం, బంధాలు, అనుబంధాలు మ‌స‌క‌బారుతున్నాయి. టెన్త్ చ‌దివే పోర‌నికి కూడా ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చి సంబ‌ర‌ప‌డే రోజులు. ఆ ఫోన్ ల‌తో మంచిక‌న్నా చెడే ఎక్కువ . అదే ఇప్పుడు యూత్‌ను, అంద‌రినీ గాడి త‌ప్పేలా చేస్తున్న‌ది. త‌ల్లిదండ్రుల నియంత్ర‌ణ లోపించ‌డంతో వారి జీవితాలు చివ‌రికి ఎటు దారి తీస్తాయో కూడా తెలియ‌ని దుర్బ‌ర ప‌రిస్థితులైతే ఏర్ప‌డ్డాయి.

సినిమాలు.. అవి తెలుగా.. హిందా….? మ‌రోటా .. ఏమ‌న్నా కానీ. చెడగొట్టేందుకు చెడు దారి చూపేందుకు, బూతులు నేర్పేందుకు, ప్రేమ పేరుతో జీవితం అల్ల‌క‌ల్లోలం చేసుకునేందుకు వాటి తోడ్పాటు కూడా అందిస్తున్నాయి. కాదంటారా..? ఓటీటీల పేరుతో ఇంట్లోనే థియేట‌ర్లు, అన్ని ర‌కాల సినిమాలు, భాష‌ల‌తో సంబంధం లేకుండా. బిగ్‌బాస్ లాంటి షోల పేరుతో నాలుగ్గోడ‌ల మ‌ద్య జ‌రిగే ర‌హ‌స్య సంభాష‌ణ‌లు ఎంతో ఇష్ట‌ప‌డే చూసే రోజులివి. జ‌నం టేస్ట్ మారింది. టీవీ షోలు, సినిమాలు.. అదే దారిలో వెళ్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అదే దారి చూపుతున్న‌ది. ఇంకేముంది… గుడ్డిగా వెళ్లిపోవ‌డ‌మే. ఏదో ఒక లోయ‌లో ప‌డిపోయేంత వ‌ర‌కు.

You missed