ఆయనకి ముగ్గురు…. కాదు కాదు నలుగురు… దినదినాభివృద్ధి చెందుతున్న అక్రమ సంబంధాలు…జనం టేస్ట్ మారింది. టీవీ షోలు, సినిమాలు.. అదే దారిలో వెళ్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అదే దారి చూపుతున్నది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో ఈ నిజం నిగ్గు తేలిందట… తెలుగు రాష్ట్రాలంటూ ఏదో చెప్పారు కానీ.. ఇక్కడా అక్కడా అని కాదు.. అంతటా అక్రమ సంబంధాలు వర్దిల్లుతున్నాయి. దినదినాభివృద్ది చెందుతున్నాయి. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కాపురాలు చెల్లాచెదరవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు…