కొత్త‌గా ఆస‌రా పింఛ‌న్ మంజూరైన ల‌బ్డిదారుల నుంచి వెయ్యి రూపాయ‌ల చొప్పున స‌ర్పంచులు వ‌సూలు చేస్తున్నార‌నే వార్త‌కు అధికారులు స్పందించారు. ఆ కార్డు కేవ‌లం ప్ర‌చారం కోస‌మేన‌ని అది లేక‌పోయినా పింఛ‌న్ వ‌చ్చేది వ‌స్తుంద‌ని తెలిపారు. ఆ కార్డు తీసుకోవాల‌ని, దాని కోసం ఖ‌ర్చ‌వుతుంద‌ని వెయ్యి రూపాయ‌ల చొప్పున వ‌సూలు చేస్తున్న విష‌యం త‌మ దృష్టికి కూడా వ‌చ్చింద‌ని స‌ద‌రు అధికారి అంగీక‌రించాడు.

ఆ కార్డు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నిచేయ‌ద‌ని, ఎవ‌రైనా దీని కోసం పైస‌ల‌డిగితే రూపాయి కూడా ఇవ్వొద్ద‌ని తెలిపాడు. ఈ కార్డును అడ్డం పెట్టుకుని డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని దీన్ని గ్ర‌హించి ఎవ‌రూ డ‌బ్బులు ఇవ్వొద్ద‌ని అధికారులు తెలిపారు.

You missed