జీవితంపై ఎన్నో ఆశలు..

పేద కుటుంబాల్లో పుట్టి..

పడరానిపాట్లు పడి..కష్టపడి చదివి..

ఈ పోటీప్రపంచంలో నిద్రలేని రాత్రులు గడిపి.. ర్యాంకులు కొట్టి..

లక్ష మందిలో ఒక్కరికి దక్కే ఆదృష్టం సర్కార్​ నౌకరి కొట్టి..

తనను కని, కష్టపడి చదివించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోని సచ్చేదాక మంచిగా చూసుకుందాం..

వచ్చిన జీతంలో హాయిగా కుటుంబ సభ్యులతో జీవితాంతం సంతోషంగా ఉందామనుకున్న సమయంలో..

ఉన్న ఉద్యోగాన్ని కొల్పోవడం, జీవిత భద్రతను దూరం చేసుకోవడం జరుగుతుంది

పై అధికారుల వేదింపుల.. లేదా ఉద్యోగం అంటే భయం లేకన, కక్కుర్తా.. తెలియదు కానీ..

మంచి భౌవిష్యత్​ను ఇలా ఏసిబి కేసుల్లో చాలా మంది యువ ఉద్యోగులు నాశనం చేసుకుంటున్నారు.

ఈ ఏసిబి కేసుల నుంచి బయట పడాలంటే.. ఇల్లు వాకిలి అమ్మీనా కష్టమే..

అందులో నిమ్న వర్గాలు,బడుగు బలహీన వర్గాల వారు ఈ కేసుల నుంచి బయటపడాలంటే మరో జన్మ ఎత్తాలి..

మొక్కరాని కాళ్లు మొక్కాలి..

ఈ పోలీస్​ ఉద్యోగంలో చాలా మంది యువ ఎస్సైలు ఏ కేసుల్లో జీవితాలు నాశనం చేసుకొని .. ప్రాణాలు వదులుతున్న సంఘటనలు ఉన్నాయి

ఉన్నదాంట్లో సర్ధుకోవడం..వచ్చిన జీతంలో సంతృప్తి చెంది.. ఉద్యోగం కొనసాగిస్తే అన్నింటికి మంచిది

నీవు వసూలు చేసి పై అధికారులకు ఇచ్చేంత వరకే నీపై ప్రేమ.. గిటువంటి జరగరాని సంఘటనలు జరిగినప్పుడు నీవెవరో.. నీ పై అధికారి ఎవరో..

ఆపద సమయంలో ఎవరు రారు.. సహకరించరు..

ఈ ఏసీబి కేసులకు కూడా దొరికేది.. కింది స్థాయి సామాజిక వర్గాల వారే.. ఎస్సై, సిఐ స్థాయి అధికారులే..ఎక్కువ

ఈ పోలీస్​ శాఖలో ఈ మంత్లీ సిస్టంను తీసివేస్తే..చాలా జీవితాలు గిట్ల నాశనం కాకుండా ఉంటాయని భావన.

పోలీస్​ నౌకరి రావాలంటే కష్టమే

నౌకరి వచ్చాక..పోస్టింగ్​ రావాలంటే కష్టమే

పోస్టింగ్​ వచ్చాక.. ఎమ్మెల్యేకు నచ్చకుంటే కష్టమే..

ఎమ్మెల్యేకు నచ్చిన..ప్రతిపక్షాలకు నచ్చకున్న కష్టమే..

అంతా ఖర్చు పెట్టి పోస్టింగ్​ తెచ్చుకున్న..లా అండ్​ అర్డర్​ కాపాడకున్న కష్టమే..

దిన దిన గండం..తృప్తి లేని జీవితం పోలీస్​ ఉద్యోగం..

పోస్టింగ్​ లేకున్న పర్వాలేదు కానీ.. లేని ఇలాంటి సహసాలకు వెళ్లి ఇలా కటకటాల పాలు కావద్దని.. యువ ఉద్యోగులకు మనవి.

Balu kayethi siricilla

You missed