త్వ‌ర‌లో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలిస్తామ‌ని ప్ర‌క‌టించాడు అల్లం నారాయ‌ణ‌. పాపం ఆయ‌న అంత‌కు మించి ఏం చేస్తాడు. ఏదో చెప్పాలి ఆ సీట్లో కూర్చ‌కున్నంక‌. ఇంకో రెండేండ్లు పెంచారు. అప్ప‌టి వ‌ర‌కు ఇలా ఏదో చెబుతూ కాలం వెళ్ల‌దీయాల్సిందే. కానీ ఇళ్ల స్థ‌లాల విష‌యంలో ఎవ‌రేమీ చెప్పినా జ‌ర్న‌లిస్టులు వినే ప‌రిస్థితి లేదు.

జ‌వ‌హార్‌లాల్ హౌజింగ్ సొసైటీకి ఇప్ప‌టికే దాదాపు హైద‌రాబాద్‌కు చెందిన 1200 మంది జ‌ర్న‌లిస్టుల వ‌ర‌కు 13 కోట్లు ప్ర‌భుత్వానికి క‌ట్టారు. మొత్తం 70 ఎక‌రాలు కేటాయించామ‌న్నారు. ఇందులో 30 ఎక‌రాలు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి దారాధ‌త్తం చేశారు. మిగిలిన దాంట్లో కోర్టు వ‌ద్ద‌న్న‌ద‌ని ఆపేశారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు పైస‌లు క‌ట్టిన వారికే స్థ‌లాలు దిక్కులేవు. మొన్న‌టి వ‌ర‌కు డ‌బుల్ బెడ్ రూం లు ఇస్తార‌ని, వ‌స్తాయ‌ని ఆశ ఉండేది. కానీ ఆ ఆశ‌ను వ‌దులుకుని కూడా చాలా కాల‌మే అయ్యింది. ఇళ్లస్థ‌లాలూ లేవు. డ‌బుల్ బెడ్ రూంలూ లేవు. అస‌లు స‌ర్కార్ మీద న‌మ్మ‌కమే లేదు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత నిర్ల‌క్షానికి గురైన సెక్ష‌న్‌ల‌లో పాపం ఈ జ‌ర్న‌లిస్టులు కూడా ఉన్నారు.

You missed