ధనుష్ వయస్సు 38 ఏళ్ళు. అంటే ఇంకా చాల జీవితం ఉంది. కాబట్టి భార్యతో జీవించడం కుదరనప్పుడు విడిపోవడం మేలు. పిల్లల విషయానికొస్తే కొంత ఇబ్బంది అవుతుంది తప్ప డబ్బుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి కాదు. పిల్లలు ఒకే ఇంట్లో తల్లి తండ్రుల దగ్గర ఉండకపోవొచ్చు కాని ఇద్దరి దగ్గరికి వెళ్ళవచ్చు అదేమంత ఇబ్బంది కాదు. బాగా ధనవంతులు సెలబ్రెటీలు పిల్లల్తో గడిపే సమయం కూడా చాల తక్కువ. ఆ తక్కువ సమయం విడాకులు తీసుకున్నా గడపవచ్చు.

తాను పెళ్లి చేసుకున్నప్పుడు 21 ఏళ్ళ వయస్సు. అది పెళ్లి, పిల్లలు, జీవితం ఏ మాత్రం అర్థం చేసుకునే వయస్సు కాదు. అప్పటి పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకొని ఉండవచ్చు. 18 ఏళ్ళ తరువాత విడిపోవాల్సిన అవసరం ఉందా అని అనిపించవచ్చు, 18 ఏంటి 28 ఏళ్ళ తరువాత కూడా విడిపోవొచ్చు. పెళ్లి అనేది జీవితంలో చాల విషయాల్లో మనిషిని బంధిస్తుంది. అందుకే కుదరనప్పుడు విడిపోవడం మేలు.

ఫలానా వయస్సు వరకే విడిపోవాలి 50 ఏళ్ళు వచ్చినవి కదా ఎందుకు విడిపోవాలి 60 వచ్చినవి కదా ఎందుకు విడిపోవాలి అని అడగానే కూడదు. ఇద్దరు వ్యక్తులు కలిసుండాలా విడిపోవాలా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఈ భారతీయ సంస్కృతి విలువలు అనేవి కాలానికి అనుగుణంగా మారిపోతాయి అవేవి ఫిక్సడ్ విషయాలు కావు. విడాకులు ఎప్పుడూ చెడ్డ విషయం కాదు. కొంతమంది కలిసుండి కష్టపడతారు, కొంతమంది చనిపోతారు కూడా, దాని కన్నా విడిపోయి జీవించడం ఎంతో మేలు కదా.

✍🏻 Gondi Kaveender Reddy

(Copied From:
Laxmi Varma garu..)
“అతనితో / ఆమెతో వేగలేను” నేను అనుకున్నప్పుడు, విడిపోవడంలో ఏమాత్రం తప్పు లేదు ! పిల్లలున్నా సరే !! అది వాళ్ళ జీవితం, వాళ్ళిష్ఠం !!!
మధ్యలో ఇతరులెవరు మాట్లాడ్టానికి ?
— Rajeshwer Chelimela

You missed