డియర్ ఫ్రెండ్స్..
Thumbs మీద బూతులు ఆపండి..లేదంటే…

వెరీ ఇంపార్టెంటె మెసేజ్..
దయచేసి ప్రతీ ఒక్కరూ చదవాలి.. Share చేయాలి
—————–
సోషల్ మీడియా ను నిర్వహిస్తున్న పలువురు YouTube ఛానెల్స్ ఓనర్స్ మీద ప్రభుత్వం సివియర్ యాక్షన్ తీసుకుంటోంది..
ఇప్పటికే దాదాపు 50 మందిని నిర్భందంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది..
కారణం…Misleading Thumbnails and Wrong Thumbnails
అంతే కాదు..Thumbnails మీద బూతులు రాయడం..
ఈ విశృంఖలత్వం ప్రదర్శించిన అందరి మీదా కేసులు పెడుతున్నారు.
———————————————————————-
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఎలా సంయమనం పాటిస్తుందో మనం కూడా పాటించాలి..పాటించాల్సిందే..
———————————————————————-
మీడియా అంటే కొమ్ములేం ఉండవు.. సోషల్ మీడియా అంటే అసలు కొమ్ములే లేవు..అది గమనించాలి
———————————————————————-

ఫ్రెండ్స్ తప్పుడు Thumbnails ఏవి ఉన్నా తక్షణం మార్చేయండి..
ఎవరు ఎవరిని బూతులు తిట్టినా…అవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఎలా సంయమనం పాటిస్తుందో మనమూ అలాగే పాటించి తీరాలి..
లేదంటే ఇదుగో ఇలా కటకటాల పాలు కావాల్సి వస్తుంది..

కొందరు దీన్ని ప్రభుత్వ వ్యతిరేక మీడియా మీద కేసులు పెడుతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు..
తప్పు..
కేవలం Thumnails మీద బూతులు రాసినవారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారు..
——————————————————–
దయచేసి రేపటిలోగా తప్పుడు Thumbs, బూతు Thumbs ఏవి ఉన్నా తక్షణం రిమూవ్ చేయండి..
లేదంటే మనం చాలా నష్టపోతాం..
——————————–
ఛానెల్ ఎగిరిపోవడం.. అరెస్టులు..కేసులు.. ఇవన్నీ జరుగుతాయి..
——————————————-
ఎవరి మాయలోనూ పడకండి.. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు నిరభ్యంతరంగా వేసుకోండి..
విమర్శించండి.. సద్విమర్శ చేయండి..
ఏవైనా ఆధారాలుంటే కుంభకోణాలు వెలికి తీయండి..
నిర్భయంగా జర్నలిస్టుగా ఉండండి..
అంతేగానీ తప్పుడు వార్తలతో.. చెత్త టైటిల్స్ తో బతికేయాలని చూస్తే మాత్రం..
డిఫమేషన్ కిందకి వస్తుంది..

సోషల్ మీడియాకు గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం..దయచేసి సహకరించండి..
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో సమానంగా మనకూ గుర్తింపు లభించబోతోంది..
దయచేసి వెంటనే మీ ఛానెల్స్ ప్రక్షాళన ప్రారంభించండి
…………………………………………..
ఇదీ ఈ రోజు సాయంత్రం నుంచి వైర‌ల్ అవుతున్న మెసేజ్‌.

యూ ట్యూబ్ చానెళ్ల పేరుతో పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చిన చెత్త జ‌ర్న‌లిస్టుల‌ను ఏరేసే ప‌నికి ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌నేది దీని సారాంశం.

ప‌నిలో ప‌ని ప్ర‌భుత్వాన్ని అదే ప‌నిగా తిట్టి పోసే వాటినీ టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌శ్నించే పేరుతో ఇష్ట‌మొచ్చిన తిట్టు, విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసే వారిని ఇక ప్ర‌భుత్వం స‌హించే ప‌రిస్థితిలో లేదు. ఇప్ప‌టి దాకా ఓపిక ప‌ట్టారు. స‌హ‌నం న‌శించింది. అస‌హ‌నం పెరిగిపోయింది. చైత‌న్యం పేరుతో మీరు ఎన్ని వేశాలు వేసినా చూస్తూ కూసోవాలా..? నో నెవ్వ‌ర్ అంటున్నాడు కేటీఆర్‌. జ‌ర్న‌లిజంలో క‌లుపు తీసే కార్య‌క్ర‌మంగా దీన్ని ప్ర‌భుత్వం చూస్తున్న‌ది. అంత వ‌ర‌కూ ఓకే. కానీ ఇదే ముసుగ‌లో ప్ర‌శ్నించే జ‌ర్న‌లిస్ట‌ల‌ను టార్గెట్ చేసి భ‌య‌భ్రాంతుల‌కు గురి అరెస్టులు చేసి లొంగ‌దీసుకోవాల‌నుకోవ‌డం ప్ర‌జాస్వామ్య‌మ‌నిపించుకుంటుందా…? అనే ప్ర‌శ్న‌లూ, నిల‌దీత‌లూ మొద‌లయ్యాయి.

మెయిన్ స్ట్రీమ్ మీడియా చేతులు ముడుచుకు కూర్చున్న‌ది. అంతో ఇంతో సోష‌ల్ మీడియాలోనే ప్రశ్నించేత‌త్వం క‌న‌బడుతున్న‌ది. నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. కానీ ఓన‌మాలు కూడా తెలియ‌నోడు జ‌ర్న‌లిస్టుగా చ‌లామ‌ణి అవుతూ.. వ్యూయ‌ర్‌షిప్ కోసం క‌క్కుర్తి హెడ్డింగులు పెడుతూ.. బూతు కంటెంట్‌ను య‌థేచ్చ‌గా కుమ్మ‌రిస్తూ.. అడ్డ‌మైన చెత్తంతా నింపి… అడ్డ‌మైన ఇంట‌ర్యూల‌ను పెడుతూ అది వైర‌ల్ అయ్యింద‌ని చంక‌లు గుద్దుకుంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ క‌లుపు తీసే కార్య‌క్ర‌మం మంచిదే. ఎంత మందిని ఏరేస్తారు. అస‌లు చెత్త‌ను తొల‌గించే పేరుతో నిఖార్స‌యిన, ప్ర‌శ్నించే గొంతుకుల‌ను కూడా పిసికేయాల‌నేదే ప్ర‌భుత్వ ఆలోచ‌నా..? అది కూడా ఇందులో భాగంగానే క‌నిపిస్తున్న‌ది.

You missed