“సర్కార్” వంటి కల్ట్ ఫిక్షనల్ బయోపిక్ తీసి భారతీయ సినిమాలో ఓ ట్రెండ్ సృష్టించిన గురూజీ అర్జీవీకి…. “అండా” ఆంటు ఓ వీధిరౌడీ బయోపిక్ తీసే ఖర్మ పట్టింది.. గురుజీవి మేధస్సు, అద్భుత ప్రాపంచిక జ్ఞానంపై అపారమైన గౌరవం వున్నా… ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు కాస్త జాలి పడటం మినహా ఏమీ చేయలేం…

నక్సల్ movement నుంచి వచ్చిన ప్రతివోడు అభ్యుదయవాది..సమాజ ఉద్దారకుడు కాలేడు… అండా ట్రైలర్లో అండా ను ఓ విప్లవ వీరుడి రేంజ్ లో చూపించారు..ఉమ్మడి వరంగల్ జిల్లా వాళ్లకు అండా గురించి మొత్తం తెలుసు… అప్పట్లో పీపుల్స్ వార్, కొందరు రాజకీయ నాయకుల మధ్య పరస్పర ప్రయోజనాలకోసం ఓ dangerous nexus ఉండేది… మాజీ నక్సల్ బ్యాక్ డ్రాప్ తో వసూళ్ళు, సెటిల్మెంట్స్, కిడ్నాప్, భూ కబ్జాలు విపరీతంగా జరిగేవి…. ఆ పరంపరలో నక్సల్ turned పొలిటీషన్స్ చాలా మంది వచ్చారు… అందులో ఈ అండా ఒకడు తప్ప అంతకుమించిన గొప్ప చరిత్ర మనోడికి ఏమీ లేదు..

ఎలక్షన్ నామినేషన్ టైం లో ఓ కుక్కను కాల్చి వేరే వాళ్ళెవ్వరు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం… కమిషన్స్ కు kidnaps చేయడం.. భూకబ్జాలు ఇవే మన అండా కెరీర్ ఘనతలు…. అన్నింటికంటే విడ్డూరం ఏందంటే అండా పేద ప్రజల తరపున పెత్తం దారులు, భూస్వాముల పై పోరాటం చేసాడట….అసలు విషయం ఏందంటే అండా కుటుంబమే పెద్ద భూస్వామ్య కుటుంబం….

గురూజీ నిజంగా బయోపిక్ తీయాలనుకుంటే అప్పటి పీపుల్స్ వార్ టాప్ లీడర్ పోలెం సుదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్కేది తీసిన కాస్త ఇన్స్పిరేషన్ గా ఉండేది… మా చిన్నతనం లో నర్సంపేట..పరకాల పరిసర ప్రాంతాల్లో ఆర్కే కు ఓ రాబిన్ హుడ్ ఇమేజ్ ఉండేది….రెండొందల మంది పోలీసుల కాల్పుల ధాటి నుంచి తప్పించుకొని ఆ ఎన్కౌంటర్ తాలూకు భయానక అనుభవాల్ని హృదయాలు ద్రవించేలా లేఖలో వివరించిన తీరు మా తరానికి ఇంకా గుర్తుంది…. అలాంటి వ్యక్తుల చరిత్రలను గ్లోరిఫై చేసినా ఆమోదయోగ్యం గానే ఉంటుంది…అంతే కాని రౌడీయిజం.. లంపెన్ శక్తులను ఒకప్పుడు తెలంగాణ సమాజానికి బందూక్ లతో భరోసానిచ్చి తిరుగుబాటు తత్వాన్ని నేర్పించిన పీపుల్స్ వార్ తో పోల్చి చూపడం ఏ మాత్రం సమంజసం కాదు…

(kaladhar rao julapally)