నిజామాబాద్‌: బోధ‌న్‌లో ఇసుక మాఫియా చెల‌గేరిపోయింది. బోధ‌న్ మండ‌లం కండ్గావ్ గ్రామంలో వీఆర్ఏ ను ఇసుక మాఫియా కొట్టి చంపింద‌నే వార్త జిల్లాలో క‌ల‌క‌లం రేకెత్తించింది. బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ సోద‌రుడే కొన్ని ఏళ్లుగా ఇక్క‌డ ఇసుక దందాను న‌డుపుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. బీజేపీ పార్టీకి చెందిన ఒక‌రిద్ద‌రు కూడా ఈ ఇసుక మాఫియాలో భాగ‌స్వామ్య‌మున్న‌ట్టు తెలుస్తోంది. వీఆర్ఏ బంధువులు ఆస్ప‌త్రి వ‌ద్ద ధ‌ర్నా చేయ‌డంతో విష‌యం వెలుగుచూసింది. అయితే అధికార పార్టీ దీన్ని క‌ప్పిపుచ్చి త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు వీఆర్ఏ ల సంఘం ప్ర‌తినిధుల‌తో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయించింది.

ఈరోజు నిజాంబాద్ జిల్లా బోధన్ మండల్ ఖండ్ గావ్ గ్రామానికి చెందిన VRA ఈరోజు రాత్రి సూసైడ్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని జీతాలు సరిపోక ఆర్థిక ఇబ్బందులకు గురై మరణించడం జరిగింది మన గౌతమ్ అన్న గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను..

ఇగో ఇదీ ఆ ప్ర‌క‌ట‌న‌.


కానీ వాస్త‌వంగా అక్క‌డ ప‌రిస్థితి వేరు. త‌మ ఇసుక దందాను బ‌య‌ట‌కు రాకుండా చేసేందుకు ప్ర‌భుత్వాన్ని కూడా బ‌ద్నాం చేసేందుకు వెనుకాడ‌లేదు అధికార పార్టీ. ఈ ఇలాఖాలో మొత్తం ఇసుక దందాకు ఎమ్మెల్యే సోద‌రుడిదే లీడింగ్‌. ఆయ‌నే అన్నీ తానై ఈ దందాను న‌డిపిస్తున్నాడు. తాజాగా నిజామాబాద్‌లో కొంత మంది వ్యాపారులు ఈ ఇసుక‌ను అడ్డుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌మ పొట్ట‌కొడుతూ ఎమ్మెల్యే సోద‌రుడు ఇష్టానుసారంగా ఇసుక స‌ప్లై చేస్తున్నాడ‌ని, ఈ ఇసుకను జిల్లా కేంద్రానికి రానీయొద్ద‌ని తీర్మానం కూడా చేసుకోవ‌డం గమ‌నార్హం.

 

You missed