ఫేస్బుక్ రౌడీషీటర్ అరెస్ట్..

“నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టిస్తూ అసభ్యకరమైన పోస్టులతో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న గోదావరిఖని జిఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ సాంబోజు అవినాష్ అలియాస్ అడుగుల అవినాష్ అరెస్ట్”
:కమీషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్

*

ప్రముఖ వ్యక్తులను టార్గెట్ గా చేసుకొని వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట నకిలీ ఫేస్ బుక్ లను సృష్టించడమే కాకుండా వివిధ రాజకీయ పార్టీల మధ్య విభేదాలను సృష్టించేందుకు అసభ్యకరమైన పోస్టులను పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని జిఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ సాంబోజు అవినాష్ అలియాస్ అడుగుల అవినాష్ ను మంగళవారం నాడు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి

గోదావరిఖని కి చెందిన ఈ రౌడీషీటర్ ప్రముఖుల కుటుంబ సభ్యులు వారి బంధువులకు చెందిన ప్రొఫైల్ ఫోటో లను డౌన్లోడ్ చేస్తూ వారి పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరుస్తూ అసభ్యకరమైన పదజాలంతో వాఖ్యలు చేయడం వారి ఫోన్ నెంబర్లను బహిర్గత పరచడం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. దీంతోపాటుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారి పేరిట కూడా నకిలీ అకౌంట్లను సృష్టిస్తూ ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా పోస్టులను పెడుతూ వస్తున్నాడు. ఇలాంటి చర్యలతో ప్రముఖులను, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను అవమానపరుస్తూ వస్తున్నాడు. ఇలాంటి చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతూ వస్తున్నది.

ఈ రౌడీషీటర్ పై పెద్దపల్లి జిల్లాలోని రామగిరి,మంథని, ఎన్ టి పి సి కరీంనగర్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. టెక్నాలజీ వినియోగం లో నిష్ణాతుడు అయిన రౌడీషీటర్ అదే టెక్నాలజీని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వినియోగిస్తూ వస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టి అవమాన పరుస్తున్న కరీంనగర్ లోని శనివారం అంగడి ప్రాంతంలో ఒక మహిళ నిలదీసింది.సదరు మహిళను హతమార్చేందుకు గాను మారణాయుధాలు ధరించి మంగళవారం నాడు ఉదయం మాటు వేసి ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు

కమీషనర్ ఆఫ్ పోలీస్
కరీంనగర్

సోర్స్ : ధాము న‌ర్మాల‌

You missed