దీక్షా దివ‌స్ .. ఈనెల 29న. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క మ‌లుపు తిప్పిన ఘ‌ట్టం. కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగాల‌ని అనుకున్న ఆ త‌రుణం తెలంగాణ‌కు ఊపిరి పోసింద‌నే చెప్పాలి. ఎన్నో మ‌లుపులు. ఎన్నో అవ‌మానాలు, ఎన్నో అనుమానాలు. అన్నీ జ‌రిగాయి. చివ‌ర‌గా కేసీఆర్ ఇక చ‌నిపోతాడు.. అదే జ‌రిగితే తెలంగాణ అగ్ని గుండ‌మ‌వుతుంద‌నే సంకేతాలు కేంద్రానికి వెళ్లాయి. సోనియా వెంట‌నే స్పందించింది. రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేయించింది. ఉద్య‌మంలో అంద‌రూ ఉన్నారు. అంద‌రి బ‌లిదానాలూ ఉన్నాయి. కానీ కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్షే దీనికి ఓ దశ‌దిశ చూపింది. స్వ‌రాష్ట్ర కాంక్ష‌కు దగ్గ‌ర చేసి కల‌గానే మిగిలిపోయిన రాష్ట్రాన్ని క‌ళ్ల‌ముందుంచింది.

ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. ఇది చ‌రిత్ర‌. ఇదే నిజం. ఆమ‌ర‌ణ దీక్ష చేసిన ఆ రోజు… అంటే న‌వంబ‌ర్ 29న దీక్షా దివ‌స్‌గా నామ‌క‌ర‌ణం చేసి అప్ప‌టి ఉద్య‌మ స్పూర్తిని గుర్తు చేసుకుంటూ.. కేసీఆర్ వ‌ల్లే ఇది సాధ్య‌మ‌య్యింద‌ని టీఆరెస్ శ్రేణులు కేసీఆర్‌ను కీర్తిస్తూ ఆ రోజున ప‌లు కార్య‌క్ర‌మాలు చేసి ప్ర‌జ‌ల‌తో పంచుకుంటారు.కానీ, తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ పూర్తిగా మారిపోయాడు. ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడిగా మారిపోయాడు. త‌న పార్టీ కూడా ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించాడు. అధికారం కోసం అన్ని పార్టీలు పోయిన పంథాలోనే పోతాన‌న్నాడు. అంత‌క‌న్నా దారుణ దారులు కూడా వెతుక్కున్నాడు.

దీక్షా దివ‌స్‌ను అస‌లు లెక్క‌లోకి తీసుకోలేదు. ఉద్యమ‌కారుల‌నే కాద‌న్నాడు. వాళ్లెంత గ‌గ్గోలు పెట్టినా ప‌ట్టించుకోలేదు. అధికారం త‌ల‌కెక్కి.. త‌న‌దైన పంథాలోనే పోయాడు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా డోంట్ కేర్ అన్నాడు. తన‌కు న‌చ్చిన ఆలోచ‌న‌లే భేష్ అనుకున్నాడు. ఎవ‌రి స‌ల‌హాలు తీసుకునే ఖ‌ర్మ నాకు ప‌ట్ట‌లేద‌నుకున్నాడు. ఎవ‌రి అభిప్రాయాల‌తో నాకేం ప‌ని మూర్ఖంగా వెళ్లాడు. కాలం మారుతున్న‌ది. ప్ర‌జ‌లు మెల్ల‌గా అన్ని తెలుసుకుంటున్నారు.

కేసీఆర్ అంటే ముందున్న అభిమానం, న‌మ్మ‌కం క్ర‌మంగా సున్న‌గిల్లుతూ వ‌చ్చాయి. వ్య‌తిరేక‌త నానాటికీ పెరుగుతున్న‌ది. ఎన్ని ప‌థ‌కాలు, ఎన్ని ప్ర‌లోభాలు పెట్టినా ఇక కేసీఆర్‌ను నమ్మ‌డం అంత ఈజీ కాదు. హుజురాబాద్ ఫ‌లితం కేసీఆర్‌ను నేల‌కు దించ‌నున్న‌ది. ఈనెల 15న వరంగ‌ల్‌లో విజ‌య‌గ‌ర్జ‌న స‌భ అన్నాడు. కౌంటింగ్‌కు స‌రిగ్గా ఒక్క‌రోజు ముందు.. నిన్న ఈ తేదీనీ దీక్షా దివ‌స్‌కు మార్చుకున్నాడు. దీక్షా దివ‌స్ పేరుతో మ‌ళ్లీ ఉద్య‌మ‌మే దిక్క‌య్యింది కేసీఆర్‌కు. తెలంగాణ సెంటిమెంట్ ను ఎప్పుడో దూరం చేసుకున్న కేసీఆర్‌… ఇప్పుడు దాని కోస‌మే ప‌రిత‌పిస్తున్నాడు. దాంతోనే ప్ర‌జ‌లకు మ‌ళ్లీ చేరువ కావాల‌ని చూస్తున్నాడు. హుజురాబాద్‌లో టీఆరెస్ ఓడిపోతున్న‌దని కేసీఆర్ ముందే ఒప్పుకున్నాడు.

You missed