నవ్వుల పువ్వులతో విరాజిల్లిన ఓ ఉద్యానం..
నేడు బాధలతో, రోదనలతో శ్మశానవాటికను తలపిస్తోంది.

కలాలు కత్తులై వీరవిహారం చేసిన చోట,
సిరాచుక్కలు కన్నీటిబొట్లుగా నేలరాలుతున్నాయి.

మనలో మనల్నే మనచేతే పరాయివాళ్లను చేయిస్తున్న
క్రూర వ్యాపారి చేతుల్లో మిగిలిపోయిన ఓ త్రాసుని.

ఎటు మొగ్గాలో తెలియని అయోమయం.

దశాబ్దపు కఠోరశ్రమ, అంకితభావం కాపాడలేనిది
ఓ పాదాభివందనం కాపాడితే నవ్వాలో, ఏడవాలో తెలియని అవమానం.

కళ్లముందే ఒక్కొక్కటిగా కూలిపోతున్న బంధాల భవనాలు.
ఇక మరచిపోయిన బానిసత్వాన్ని మళ్లీ అలవాటు చేసుకోవాలి.
మిగిలిన బంధాలనయినా దక్కించుకోవాలంటే తప్పదు.

(పేరు రాయ‌ని ఓ విలేక‌రి)

 

You missed