క‌రోనా ఎఫెక్ట్‌, ఆర్థిక సంక్షోభం అన్ని రంగాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ప్రింట్ మీడియా ఉద్యోగుల ప‌రిస్థ‌తి మ‌రింత ద‌య‌నీయంగా మార‌నుంది. ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌న్నీ ఉద్యోగుల‌ను తీసేసి భారం దించేసుకొని హాయిగా ఊపిరి పీల్చుకునే ప‌నికి ఏడాది క్రితం నుంచే శ్రీ‌కారం చుట్టింది. ఇందులో ఏ ప‌త్రికా మిన‌హా యింపు కాదు. అధికార పార్టీ టీఆరెస్ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ సైతం ఉద్యోగుల‌ను పీకేసీ రోడ్డున ప‌డేసేందుకు ఏమాత్రం సంకోంచిచ‌డం లేదు. ఓ ర‌కంగా వేరే ప‌త్రిక‌ల క‌న్నా ఈ విష‌యంలో న‌మ‌స్తేనే కొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. క‌రోనా మొద‌టి వేవ్ వ‌చ్చిన తొలినాళ్ల‌లోనే ఈ మేనేజ్‌మెంట్‌కు కోతికి కొబ్బ‌రిచిప్ప దొరికిన‌ట్ల‌యింది. దాదాపు 200 మందిని ఏడాది క్రితం తీసేసింది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షిఇదే బాట‌లో ఒక‌రిని చూసి ఒక‌రు, ఒక‌రిని మించి మ‌రొక‌రు.. ఇలా ఉద్యోగుల‌ను పీకేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా న‌మ‌స్తేలో మ‌రో 100 ఉద్యోగుల‌ను తీసేసేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. దీని వెనుక క‌స‌ర‌త్తు పూర్తైంది. ఈనాడు ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు డిజిట‌ల్ మీడియాకే ప‌రిమితం అయ్యేందుకు అడుగులు వేస్తున్న త‌రుణంలో మిగిలిన ప‌త్రిక‌లు కూడా మేమేమి త‌క్కువ కాదంటూ ఉద్యోగుల‌ను ఎడాపెడా తీసేస్తున్నాయి. ఇప్ప‌టికే అన్ని ప‌త్రిక‌ల స‌ర్క్యూలేష‌న్ పాతాళంలోకి దిగ‌జారాయి. న‌మ‌స్తే తెలంగాణ 60 వేల‌కు ప‌రిమితం చేస్తుండ‌గా, ఈనాడు 1.50 ల‌క్ష‌లు, సాక్షి ల‌క్ష‌, జ్యోతి 40వేల వ‌ర‌కు ప్రింటింగ్ చేస్తున్నాయ‌ని మార్కెట్‌లో టాక్ న‌డుస్తున్నాయి. మ‌రో వైపు కేంద్రం న్యూస్ ప్రింట్ పై స‌బ్సిడీ ఎత్తేసిన నేస‌థ్యంలో మొన్న‌టి వ‌ర‌కు ఒక ప‌త్రిక ముద్ర‌ణ‌కు 30 రూపాయ‌ల భారం ప‌డ‌గా.. ఇప్ప‌డ‌ది వంద రూపాయ‌ల వ‌ర‌కు చేరుకోనుంది. ఎంత రిస్క్ తీసుకొని ముద్రించినా ఆ స్థాయిలో ప‌త్రిక‌ల ఆదాయ‌మేమి పెర‌గ‌డం లేదు. పెరిగే అవ‌కాశాలూ లేవు. దీంతో ఉన్న ఉద్యోగుల‌ను త‌గ్గించుకోవ‌డం ఒక్క‌టే మార్గంగా ఇవీ భావిస్తున్నాయి. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ త‌రువాత ప‌రిస్థితి మ‌రింత ఘోరం కానుంది. 500 వంద‌ల మంది ప‌నిచేసే చోట ఓ వంద మందితో ప‌ని చేయించుకోవాల‌నే ఆలోచ‌న‌లో ప‌త్రిక‌లున్నాయి.

ఇప్ప‌టికే అన్ని ప‌త్రిక‌ల స‌ర్క్యూలేష‌న్ పాతాళంలోకి దిగ‌జారాయి. న‌మ‌స్తే తెలంగాణ 60 వేల‌కు ప‌రిమితం చేస్తుండ‌గా, ఈనాడు 1.50 ల‌క్ష‌లు, సాక్షి ల‌క్ష‌, జ్యోతి 40వేల వ‌ర‌కు ప్రింటింగ్ చేస్తున్నాయ‌ని మార్కెట్‌లో టాక్ న‌డుస్తున్నాయి. మ‌రో వైపు కేంద్రం న్యూస్ ప్రింట్ పై స‌బ్సిడీ ఎత్తేసిన నేస‌థ్యంలో మొన్న‌టి వ‌ర‌కు ఒక ప‌త్రిక ముద్ర‌ణ‌కు 30 రూపాయ‌ల భారం ప‌డ‌గా.. ఇప్ప‌డ‌ది వంద రూపాయ‌ల వ‌ర‌కు చేరుకోనుంది. ఎంత రిస్క్ తీసుకొని ముద్రించినా ఆ స్థాయిలో ప‌త్రిక‌ల ఆదాయ‌మేమి పెర‌గ‌డం లేదు. పెరిగే అవ‌కాశాలూ లేవు. దీంతో ఉన్న ఉద్యోగుల‌ను త‌గ్గించుకోవ‌డం ఒక్క‌టే మార్గంగా ఇవీ భావిస్తున్నాయి. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ త‌రువాత ప‌రిస్థితి మ‌రింత ఘోరం కానుంది. 500 వంద‌ల మంది ప‌నిచేసే చోట ఓ వంద మందితో ప‌ని చేయించుకోవాల‌నే ఆలోచ‌న‌లో

ప‌త్రిక‌లున్నాయి.

You missed