భారత దేశంలో కరోనా సోకినవారు ఎంత మంది ? ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిరో సర్వే ప్రకారం తొంబై కోట్లు . మరి మరణాలు ఎన్ని ? ప్రభుత్వ లెక్కలు తప్పు అని అమెరికా కు చెందిన CDC సంస్థ చెప్పింది . గత 17 నెలలుగా మరణించిన వారు ఎంత మంది ? ఇదే కాలం లో కరోనా పూర్వ యుగం లో మరణించిన వారు ఎంత మంది అని లెక్కలు తీసి మొత్తం నలబై లక్షల మంది కరోనా వల్ల మరణించారు అని తేల్చింది . భారత దేశం పై కాల్చిన బట్ట వెయ్యడం పాశ్చాత్య మీడియా కు అలవాటే . పోనీ వారి లెక్కే కరెక్ట్ అనుకొందాము .

తొంబై కోట్ల మందికి కరోనా సోకితే మరణించిన వారు నలబై లక్షలు . అంటే మరణాల రేటు O . 4 . అంటే వెయ్యి మందికి సోకితే నలుగురు మరణించారు .

గత సంవత్సరం ఇటలీ , ఇంకా అమెరికా లోని న్యూయార్క్ నగరాల్లో స్థితి చూసి మరణాల రేటు అయిదు శాతం అని ప్రచారం జరిగింది . అంటే వంద మందికి సోకితే అయిదు మంది మరణిస్తారు అని ప్రచారం .

భారతీయులకు ఈ స్థాయిలో ముప్పు ఉండదు . ఇక్కడ మరణాల రేటు .౦ . 5 కంటే తక్కువ ఉంటుంది అని నేను చెప్పాను. దీనిపై పెద్ద వివాదం చెలరేగింది . పిచ్చి పిచ్చి లెక్కలు చెబుతున్నాను .. నేను చెప్పిన దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు అని కొంత మంది మేధావులు దాడి చేసారు .

నేను చెప్పిన మరో విషయం .. మాస్క్ .. భౌతిక దూరం .. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి . కానీ భారత దేశం లాంటి జనాభా ఎక్కువ , జన సాంద్రత అధికం , పౌర క్రమశిక్షణ తక్కువ ఉన్న దేశాల్లో ఇది ఆచరణ సాధ్యం కాదు . కాబట్టి ప్రజల్లో రోగ నిరోధకత పెచుకోవడం పై ద్రుష్టి సారించేలా ప్రచారం జరగాలి . అంటే ఎండ .. డి విటమిన్ .. శాఖాహారులు బి 12 విటమిన్ .. బయాందోళననలు వ్యాపింప చేయకుండా ఉండడం .. ప్రజల్ని అప్రమత్తం చేయడం .. కానీ జరిగింది ఏమిటి ? కరోనా కట్టడి ప్రచారం .. కేరళ ఆదర్శం .. ఆ దేశం ఆదర్శం అన్నారు .. చివరికి ఏమి జరిగింది ? తొంబై కోట్ల మందికి సోకింది . ప్రజల్లో బయన్దోళనలు వ్యాపింప చేయకుండా సరైన అవగాహహన కల్పించి ఉంటే కనీసం ముప్పై లక్షల ప్రాణాలు దక్కేవి .

ఇప్పటికైనా మూడో వేవ్ అని బయపెట్టకుండా జనాల్లో సరైన అవగాహహన కల్పిస్తే ఆర్థిక వ్యవస్థ అయినా నిలబడుతుంది . రెండో వేవ్ లో భయకంపితులు అయిన ప్రజల మానసిక స్థితి ఆడుకొంటే ఇంకా నష్టం జరుగుతూనే ఉంటుంది.

Amarnath vasireddy

You missed