తొండి గేమ్ … వాడొప్పుకోడు !

డిసెంబర్ 20 … ఒక్కసారిగా కరోనా భయానక వార్తలు గుప్పుమన్నాయి .. గుర్తుంది కదా !

చైనా లో కరోనా పడితే, ఇక్కడ ముక్కు పుల్ల పెట్టేసారు !

శూన్యంనుంచి బ్రహ్మాండాన్ని ఒక్కరోజులో సృష్టించేసారు !

కొత్త వేరియెంట్ అన్నారు . అది వాయు వేగం తో విస్తరిస్తుంది అన్నారు . జలుబు దగ్గు లేకుండానే బాడీ ని దెబ్బ తీస్తుందన్నారు { అది ఎలాగబ్బా ??}

లాక్ డౌన్ పెట్టేస్తున్నారు అన్నారు

దీనితో జనాల్లో తిరిగి భయం ..

చిన్నపాటి జలుబు వచ్చినా, తిరిగి టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లేలా చేసారు . టెస్ట్ ల సంఖ్య పెంచారు

ఈ లోగా క్రిస్మస్ .. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ….. ప్రభుత్వాలకేమో ఆదాయం కావాలి . దానితో విచ్చలవిడిగా కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతులు . కొన్ని లక్షల మంది వేడుకల్లో .. కోట్లమంది రోడ్ ల పై !

ఈ రోజు జనవరి ఆరు … వీరు చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటికి ఇండియా లో, రోజుకు కనీసం లక్ష కేసులు వచ్చి ఉండాలి . తీరా చూస్తే ఈ రోజు కేసులు… ముక్కి మూలిగి…. 200 లోపే .

తొండి.. ఫార్మసుర బ్రోకర్ ఒప్పుకోడు..

సరే వాడి పని అవుతున్నట్టే వుంది . లైన్ లో నిలబడి తిరిగి సూది వేసుకొంటున్నవారి సంఖ్య పెరిగింది .

❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌

ఇంకో విషయం ..

👇👇👇👇👇👇👇

కరోనా పోదు .. ముక్కున్న ప్రతోడికి కనీసం రెండేళ్ల కొక సారి సోకుతుంది అని ఎన్నో సార్లు చెప్పాను గుర్తుంది కదా !

ఇప్పుడు కరోనా లక్షణాలు ఏంటి ?

తొలి రెండు వేవ్ ల లో రుచి, వాసన తెలియక పోవడం .. ఆల్ఫా డెల్టా కరోనా ల వల్ల ఇది జరిగేది .

అటు పై ఓమిక్రాన్ వచ్చింది . జలుబు.. గొంతు గరగర ..

ఇప్పుడు ఓమిక్రాన్ పిల్లలు వచ్చాయి .. వాటి వల్ల కొంతమందిలో మియాల్జియా వస్తోంది .

భయపడకండి .. చదవండి …

మియాల్జియా అనేది భుజాలు , తొడలు మొదలయిన చోట కలిగే కండరాల నొప్పి .

ఎందుకు వస్తుంది ?

వైరస్ సోకినప్పుడు కొంతమంది శరీరం , ఓవర్ రియాక్ట్ అవుతుంది . వారి శరీరం లోని ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయ్యి వైరస్ ను చంపడానికని పెద్ద మొత్తం లో సైటోకిన్ కణాలను విడుదల చేస్తుంది . ఈ సైటోకిన్ స్ట్రామ్ వల్లే మొదటి రెండు వేవ్ ల లో ఎక్కువ మంది మరణించారు . నా పరిశీలన లో బి 12 విటమిన్ లోపం ఉన్న వారిలో ఇది ఎక్కువ గా జరిగింది .

మాంసాహారుల్లో B- 12 లోపం ఉండదు . ఎందుకంటే చికెన్, మటన్, ఎగ్ ల లో ఈ విటమిన్ వుంది . అదే శాఖాహారం లో… తౌడు లాంటి వాటిలో మినహాయించి, ఇది దొరకదు . మీకు గుర్తుందా ? శాకాహారులు ముఖ్యంగా వాణిజ్య కులాల వారు బి 12 టాబ్లెట్స్ తీసుకోవాలి అని నేను పెట్టిన వీడియో లు వైరల్ అయ్యాయి .

ప్రముఖ గాయకుని మరణం , అలాగే అప్పట్లో వాణిజ్య కులాలకు చెందిన కొంతమంది మరణం ఈ సైటోకిన్ స్ట్రామ్ వల్లే జరిగింది .

{అప్పట్లో కరోనా మరణాలు అన్నీ సైటోకిన్ స్ట్రామ్ వల్లే జరిగిందని చెప్పడం లేదు . మరణించిన వారందరూ శాఖాహారులు అని చెప్పడం లేదు . బాగా చదివి అర్థం చేసుకోగలరు }

సరే .. ఇప్పుడన్నీ చేదు జ్ఞాపకాలు .. వాటిని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే …

వైరస్ పోలేదు .. పోదు .. వైరస్ సోకితే కొంత మంది ఇమ్మ్యూనిటి సిస్టం ఓవర్ రియాక్ట్ కావడం పోలేదు .. అంటే సైటోకిన్ స్ట్రామ్ ఇంకా జరుగుతోంది . కానీ ఇప్పుడు దాని వల్ల అంత డేంజర్ ఏమీ లేదు .

ఇలా ఇమ్మ్యూనిటి ఓవర్ రియాక్ట్ అయిన వారిలో { ఓమిక్రాన్ పిల్లలు సోకినప్పుడు } కండరాల నొప్పులు వస్తున్నాయి . . 1. ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకోవడం .. 2 . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం , 3. మూడు – నాలుగు లీటర్ ల నీరు తాగడం ద్వారా దీన్ని సులభంగా జయించవచ్చు .

బహుశా వెయ్యి లో ఒక్కరికి ఈ నొప్పులు తీవ్రంగా ఉండి రెండు రోజులు దాటాక కూడా కొనసాగుతాయి . నొప్పులు మరీ తీవ్రంగా ఉంటే ఆసుపత్రికి వెళ్ళ వచ్చు .

మియాల్జియా అని మీడియా మిమ్మల్ని భయపెట్టే లోపే ముందే చెప్పేస్తున్నాను . ఇదేదో హైరానా పడాల్సిన విషయం. కాదు .

పైన చెప్పినట్టు చాలా అరుదయిన కేసుల్లో రేండు రోజులు దాటి కండరాల నొప్పులు ఉంటే వారి LDH పెరిగిందని , అనారోబిక్ గ్లైకాలసిస్ వారి శరీరం లో జరుగుతోందని దాని వల్ల వారి కండరాలకు తగినంత ఆక్సిజన్ అందలేదని అర్థం

వామ్మో కండరాల నొప్పులు అని వీరు బెంబేలు పడుతారు. ఇంకేముంది ? నొప్పి అయితే పెయిన్ కిల్లర్ వేసుకోండి అని అని ఎవరైనా చెబితే .. వారు వేసుకున్నా అది పని చేయదు . పెయిన్ కిల్లర్ వేసుకున్నా నొప్పి తగ్గక పొతే వీరు మరింత భయపడుతారు..

అలాంటి వారు మీకు తారసపడితే చెప్పండి ..

ఓమిక్రాన్ పిల్ల జాతులు సోకడం వల్ల వచ్చిన కండరాల నొప్పి పెయిన్ కిల్లర్ ల కు తగ్గదు .

బాగా రెస్ట్ తీసుకోవడం .. విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోవడం { కండరాల నొప్పి వున్నప్పుడు టాబ్లెట్స్ .. మామూలు సమయాల్లో పుల్లటి పండ్ల ద్వారా సి విటమిన్ అందుతుంది } . ఇంకోటి వుంది . అది తీవ్ర కండరాల నొప్పులు ఉన్న వారు మాత్రమే అది కూడా ఆ నాలుగు అయిదు రోజులు చెయ్యాల్సిన పని .

Vasireddy Amarnath

You missed