కొంచెం దగ్గు.. మరికొంచె సర్ది .. వస్తే చాలు అయితే డాక్టర్ లేదా మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఒక మందు తెచ్చి వాడేస్తాం. హమ్మయ్యా..! ఇక తగ్గిపోతుంది లే అని అనుకుంటాం. కానీ అసలు సమస్య ఇప్పుడే, ఇక్కడే మొదలవుతున్నది. దగ్గు మందు పేరుతో చిన్నారులకు పోసే టానిక్‌లు వారి ప్రాణాలు హరించేస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. వాస్తవంగా వైద్యశాస్త్రంలో దగ్గు, జలుబు కోసం ఈ టానిక్‌లు వాడాలనే లేదట. కానీ అలా విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చినవి, డాక్టర్లు రాసినవి, మెడికల్ షాపతను ఇచ్చినవి విరివిగా వాడేస్తున్నాం. దాంతో మంచిగా ఉన్న ప్రాణాలు కాస్తా రిస్క్‌లో పడేసినట్టువుతంది.
ఇప్పటికే ఇలాంటి కేసుల్లో పిల్లలు చనిపోవడం, కొన్ని ఔషదాలపై దర్యాప్తు కూడా జరుగుతున్నదట. గుండె కొట్టుకునే వేగం పెరగడం, శ్వాస మందగించడం లాంటి సైడ్ ఎఫెక్టులు ఉంటున్నాయని వైద్యులు గుర్తించారట. దగ్గు మందులో మత్తును కలిగించే గుణం ఉండటం కూడా ఇది అలవాటుగా మారే ప్రమాదం ఉంది. చాలా మంది పెద్దలు కూడా మత్తు కోసం దగ్గు మందును వాడే సంఘనటలు ఉన్నాయి. కోరెక్స్ లాంటి దగ్గుమందును విచ్చలవిడిగా కొనుగోలు చేసి మత్తు కోసం వాడటం.. వీటి కొనుగోళ్లలో పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా స్కాంకు పాల్పడటం కూడా చూశాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఈ మందు వాడొద్దని ఆదేశాలు వచ్చినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అంతలా ఇది అలవాటు చేసుకున్నారు. ఇది అలవాటుగా మార్చుకున్న వారి కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు.
పిల్లలకు దగ్గు వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు పాటించడమే బెటరని సూచిస్తున్నారు వైద్యులు. పాలల్లో పసుపు కలుపుకుని తాగడం మూలంగా కొంత ఉపశమనం ఉంటుందంటున్నారు. ఆయుర్వేదంలో దొరికే మందులూ బెటరనే సలహాలు ఇస్తున్నారు.