డెల్టా ప్లస్ అంటూ భయపెట్టిన మాయదారి మల్లయ్య ఇప్పుడేమంటారు..
జూన్ మొదటి వారంలో ఒక వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలలో డెల్టాప్లస్ గూర్చి ప్రజలలో భయాందోళన రేకట్టించారు.ఇంటికో శవం లేస్తుందని, ఊపిరితిత్తులు కుళ్లిపోతాయి, ఒక రోజులోనే మరణం, టెస్టులకు దొరకదు, వ్యాక్సిన్ పనిచేయవు …అని జనంలో విపరీత భయాన్ని పెంచారు. అప్పడు విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పా, వైరస్ అన్నాక mutation సహజమని, ఆందోళన అవసరం లేదు. ఆ వ్యక్తి జూన్‌లో డెల్టాప్లస్ గురించి చెప్పింది Indian SARS – Cov2 Genomics Consortium (Insacog) అనే సంస్థ చెప్పిన సమాచారం ఆధారంగా, ఆ సంస్థ కేవలం కొత్త వేరియెంట్ కనిపిస్తుందని చెబితే దానికి ఈ వ్యక్తి క్షుద్రకథలు అల్లి ప్రజలలో భయాన్ని పెంచాడు. దాని మూలంగా థర్డ్‌వేవ్ కూడా వస్తుందని హెచ్చరించాడు. డెల్టాప్లస్ మూలంగా థర్డ్‌వేవ్ రాదని నా అభిప్రాయమని కొన్ని ఆధారాలతో చెప్పాను. ఇప్పుడు ఇదే సంస్థ Insacog విడుదల చేసిన కొత్త నివేదికలో డెల్టాప్లస్, డెల్టా కన్న ప్రమాదకారి కాదని, ప్రపంచ వ్యాప్తంగా దాని వ్యాప్తి 1% తక్కువగా ఉందని, అమెరికా, బ్రిటన్ దేశాల్లో పూర్తిగా అంతరించిపోయిందని తేల్చి చెప్పింది. భారత దేశంలో కూడా 88% కేసులు డెల్టా వల్లనే అని కూడా తేలింది. డెల్టాప్లస్ కొత్త కేసులు నమోదు కావడం లేదని కూడా ప్రకటించారు. భారతదేశంలో డెల్టాప్లస్ వల్ల కేవలం ఒక్కరే మరణించారని ఆ వ్యక్తి కూడా 80 సంవత్సరాల వయసు వ్యక్తి, దీర్ఘకాలికంగా ఇతర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి. తమకు తాము అమిత మేధావులుగా భావించే కొందరు సుడో మేధావులు తమకు సంబంధం లేని అంశాల పై చెప్పే అంశాలు ప్రజల్లో ఎంతో భయాన్ని రేకెత్తిస్తాయి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- కరోనా నుంచి రక్షణ – దశ సూత్రాలు….
- సమూహాలకు దూరంగా ఉండాలి.
- భౌతిక దూరం పాటించాలి.
- మాస్కు వీలైతే డబుల్ మాస్కు, ఫేస్ షిల్డ్ ధరించాలి.
- వ్యక్తిగల పరిశుభ్రత పాటించాలి.
- వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలి.
- వ్యాయామం రోజు చేయాలి.. ఎండలో కనీసం 30 నిమిషాలు గడపాలి.
- నిద్ర నిండుగా 8 గంటలు ఉండేలా చూసుకోవాలి.
- పోషక ఆహారం తీసుకోవాలి.
- సానుకులంగా ఆలోచించాలి.
- ఆరోగ్య జీవన శైలి అలవర్చుకోవాలి.
Dr. A. Venu gopala reddy
MSc.phd.microbiology
