నాన్న….ముగ్గురు ఆడపిల్లల తండ్రి అయిన మీతో మేము ఏనాడు పీరియడ్స్ కి సంబంధించిన ఏ అంశము గురించి మాట్లాడలేదు.ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం లో పీరియడ్స్ ఒక నిషిద్ద పదము , ఆడవాళ్లు అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అంశము. కడుపునొప్పితో బాధపడుతున్నా , నీరసంగా ఉన్నా, ఏమైంది ? అని అడిగిన మీకు కూడ ఇదీ సమస్య అని చెప్పలేదు ఎప్పుడు., కాని Menstrual Hygiene Awareness Programs చేద్దామనుకున్నప్పుడు నేను మొదటిసారి మీతో చర్చించాను.
Pathologist reports కోసం వచ్చిన మహిళలల్లో, చాలా మంది చిన్న వయసులో ( 25- 40 సం) గర్భసంచి (Uterus) తీసివేయబడ్డ వారి సంఖ్యను చూసి మనసు చలించి, సీనియర్ గైనకాలజిస్ట్ లతో ఈ సమస్య పరిష్కారం కోసం వెతకగా, అదే విధంగా బాలికల రక్తహీనత , బడి మానివేయడం లో ప్రధానమైన కారణం కూడ ఇదే అని తెలిసినప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయించుకున్నాను.
ఏడాది క్రితం, నేను Menstrual Hygiene Project చేపట్టిన మొదటిరోజు నుండి జీర్ణించుకోలేక, ఎగతాళి చేసిన వారి మాటలతూటాలే నన్ను నిరంతరంగా పని చేయడానికి ప్రోత్సహించాయి. అలాగే నన్ను నిర్మాణత్మక విమర్శలు చేసిన వారికి నా ధన్యవాదాలు.
ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ హెల్త్ కిట్స్ పంపిణి కార్యక్రమమే వారికి సమాధానం.
సర్కార్ బడులలో చదివే 8 లక్షల బాలికలందరికి ప్రతి ఏడు 100 కోట్ల బడ్జెట్ తో గౌ॥ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు గారు మరియు మీ చొరవతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం, ఇతర రాష్ట్రలకు కూడ మార్గదర్శకం కావాలని ఆకాంక్షిస్తున్నాను.ఇంతటి గొప్ప కార్యక్రమంలో నా చిన్న భాగస్వామ్యం చాలా తృప్తినిచ్చింది.
ఇంతటితో ఆగకుండ, గ్రామీణ మహిళలకు, పేద బాలికలకు Menstrual hygiene , Breast & Cervical cancer పైన నిరంతరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టుతూ ఒక డాక్టర్ గా నా పరిజ్ఞానాన్ని పంచుతూ నా బాధ్యతను నెరవేరుస్తాను.
ఈ #MENSTRUAL_HYGIENE Project కి సహకరించిన అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
~Dr. Kadiyam Kavya
#DIGNITY_PERIOD #MHP #NO_MORE_LIMITS