ఓ నిజం పిశాచ‌మా

కాన‌రాడు నినుపోలిన రాజు మాకెన్న‌డేనీ

తీగ‌ల‌ను తెంపి అగ్నిలో దింపినావు

నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణా

అంటూ దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు నిజాం నిరంకుశ పాల‌న పై నిజామాబాద్ ఖిల్లా జైల్లో బొగ్గుతో త‌న క‌విత ద్వారా అగ్నిధార కురిపించాడు. తెలంగాణ తొలిత‌రం ఉద్య‌మంలో నిజాం పాల‌కులు నిజామాబాద్ జైలులో బంధించారు. మూడునెల‌ల పాటు ఆయ‌న ఇక్క‌డే ఉన్నాడు. బొగ్గుతో త‌న క‌విత‌లు రాస్తూ విప్ల‌వాగ్నిని ర‌గిలించాడు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ప్రాంతాన్ని గుర్తించి ఆయ‌న చిత్ర‌ప‌టాలు ఏర్పాటు చేసి స్మార‌క కేంద్రంగా త‌యారు చేసింది. మూడేళ్ల క్రితం దేశ్‌ప‌తి శ్రీ‌నివాస్‌తో పాటు అప్ప‌టి నిజామాబాద్ ఎంపీ క‌విత త‌దిత‌రులు ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించి దీన్ని ప‌ర్యాట‌క కేంద్రంగా మారుస్తామ‌ని, క‌ళా క్షేత్రంగా చేస్తామ‌ని హామీలిచ్చారు. ఆ త‌ర్వాత ఇటు వైపు వ‌చ్చి చూసిన వారు లేరు. ఇప్పుడ‌ది చెద‌లు ప‌ట్టి క‌నిపిస్తున్న‌ది. ప‌శువుల కొట్టంలా త‌యారైంది.

You missed