వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
నమస్తే తెలంగాణలో ఉద్యోగులను తీసేస్తున్నారనే వార్తను నిర్బయంగా రాసిన జర్నలిస్టులపై క్షక్షసాధింపు చర్యల్లో భాగంగా లీగల్ నోటీసులివ్వడం సరైన చర్య కాదని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం మండిపడింది. ఈ మేరకు ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో జరిగిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రహమాన్ అధ్యక్షన జరిగిన సమావేశంలో తొమ్మిది మీడియా సంస్థలకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు జర్నలిస్టులు. మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని గ్రహిస్తే ఖండన తెలపాలె గానీ, వందకోట్ల నష్టం జరిగిదంటూ లీగల్ నోటీసులు ఇవ్వడం సరైంది కాదని, ఆ జర్నలిస్టులకు తాము అండగా నిలుస్తామని, పోరాడుతామని అన్నారు. ఇలా నోటీసులు ఇస్తూ పోతే నిత్యం ప్రతికలకు వందల నోటీసులు పంపాల్సి వస్తుందన్నారు.
నమస్తే తెలంగాణ పత్రిక బీఆరెస్ పార్టీ పత్రికని, ఈ నోటీసుల వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు కూడా సంబంధం ఉంటుందని అన్నారు. కేటీఆర్‌కూ ఓ లేఖ ద్వారా ఈ చర్యపై వివరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని కూడా కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నారు. లీగల్ నోటీసులపై ఆ జర్నలిస్టుల పక్షాన న్యాయపోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు.
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం..
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రహమాన్, ఉపాధ్యాక్షుడిగా కందుకూరి రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రమేశ్, జాయింట్ సెక్రటరీలుగా ఖాజీపేట నరేందర్, సుమబాల, దస్తగిరి, కోశాధికారిగా యాటకర్ల మల్లేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్బాస్, సాధిక, పసునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.