ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?

ByDandugula Srinivas

Mar 1, 2024

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

పాపం…! కేటీఆర్‌..!! ఎవరిస్తున్నారో సలహాలు. ఆది నుంచి అవే రాంగ్‌ స్టెప్స్‌. వేరే విషయాల గురించి ఇప్పుడు ప్రస్తావనార్హం కాని.. నమస్తే తెలంగాణ పేపర్‌ విషయంలో కేటీఆర్‌ తీసుకుంటున్న చర్యలు.. పట్టించుకోని వైనం సర్కార్‌ పతనానికి ప్రధాన కారణమనే చెప్పొచ్చు. దీనికి తోడు మీడియా విషయంలో కేసీఆర్‌ దోరణి, పట్టింపులేనితత్వం, అవహేళన, అవమానాలు ప్రభుత్వం ఓడిపోయేందుకు కారణమయ్యాయి. ఇవన్నీ కేటీఆర్‌కు తెలుసు. కేసీఆర్‌కూ తెలుసు. కానీ ఇవాళ జరిగిన ఓ సంఘటన ఆశ్చర్యమేసింది. అధికారం కోల్పోయాక నమస్తే తెలంగాణలో చాలా మంది ఉద్యోగులను తీసేయడానికి యాజమాన్యం సిద్ధమవుతుందనేది వార్త. పలు మీడియాల్లో వచ్చాయి. ఇప్పుడు వీటిపై తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు జారీ చేసింది నమస్తే తెలంగాణ యాజమాన్యం. ఇందులో ‘వాస్తవం’ కూడా ఉంది. దీని వల్ల వారికి వంద కోట్లకు పైగా నష్టం వచ్చిందట.

మరి ఎడిటర్‌గా వచ్చిన తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చీరాగానే వందల మంది తెలంగాణ జర్నలిస్టులను పీకేసి రోడ్డున పడేసి వారి జీవితాలను, కుటుంబాలను చిన్నాభిన్నం చేశాడు కదా..? నాశనమైన ఈ కుటుంబాలకు ఎంత విలువ కడుతారు.. తీగుళ్ల అండ్‌ కేటీఆర్‌..? ఇవన్నీ కేటీఆర్‌కు తెలుసు. కానీ అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నమస్తే తెలంగాణ హెడ్‌ ఆఫీసు ముందు ధర్నా చేసేందుకు ఉద్యోగులు సంకల్పించగా… విషయం తెలుసుకుని అప్పుడు ఎంటర్‌ అయ్యాడు కేటీఆర్‌. వారికి రెండు నెలల జీతాలు ఇచ్చి చల్లబర్చాడు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని అడగలేదు. తీగుళ్లను మందలించలేదు. ఇప్పటికీ తొలగించలేదు. ఇది సరిపోదంటూ ఇప్పుడు మీడియాకు లీగల్‌ నోటీసులు.

వాస్తవంలో బీఆరెస్‌ సర్కార్‌ ఉన్నప్పుడే ఎడిటర్‌ ఉద్యోగుల మీద చూపుతున్న కక్షపూరిత వైఖరిని ఎండగడుతూ వరుస కథనాలు రాసింది. దీనిపై అధికారం ఉంది కదా అని ‘వాస్తవం’ ప్రతినిధి దండుగుల శ్రీనివాస్‌పై సైబర్ క్రైం కేసు పెట్టింది నమస్తే యాజమాన్యం. ఇప్పుడు మళ్లీ తొమ్మిది మీడియా సంస్థలకు నోటీసులిచ్చింది.

‘మేమూ ఓ వంద యూ ట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే బాగుండు’అని మాట్లాడి తన అవివేకాన్ని చాటుకున్న కేటీఆర్‌.. తమ మౌత్‌పీస్‌ మీడియా సంస్థలైన నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌లను జనాలు నమ్మడం లేదని చెప్పుకున్నాడు. తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని గగ్గోలు పెట్టాడు. మరి ఆ వంద యూట్యూబ్‌ చానళ్లపై కూడా లీగల్‌ నోటీసులు ఇవ్వకపోయారా.. కేటీఆర్‌ సార్..! మీ అహంకారం, మితిమీరన అధికారమదమే మీకీ పరిస్థితిని తీసుకొచ్చింది. నమస్తే తెలంగాణ ఉద్యోగుల ఉసురు తగిలి మీ సర్కార్‌ పతనమైంది. ఇంత జరిగినా ఇంకా మారరా..?

 

You missed