దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
సవాల్‌రెడ్డి పేరుతో పెట్టిన ఈ పోస్టులో నరనరాన అహంకారపు మాటలు కోరలు చాస్తున్నాయి. అసలు పేరు ఎస్జీవీ శ్రీనివాసరావు. నమస్తే తెలంగాణ పేపర్‌లో నెట్‌వర్క్ ఇంచార్జి. కేసీఆర్ ఓటమికి, బీఆరెస్ ప్రభుత్వ పతనానికి, పార్టీ అధఃపాతాళానికి పోవడానికి ఇగో ఇలాంటి అంహకారపు రాతలే. మేథావుల ముసుగులో తమకే అంతా తెలుసుననే నోటిదూల చేష్టలే. కేసీఆర్ సీఎం పదవిని గడ్డి పరకతో చూస్తాడట. అందుకే సీఎం పదవి నుంచి దించి ఫామ్ హౌజ్‌లో కూర్చోబెట్టారన్నమాట ప్రజలు. అంతేనా సార్.. ఎస్జీవీ గారు..! నమస్తే తెలంగాణ ప్రతిక ఆ పార్టీకి, ప్రభుత్వానికి ఏం మేలు చేసిందేమో గానీ.. ఇలాంటి రాతలు, అత్యుత్సాహపు చేష్టలతో మరింత దిగజార్జి భ్రష్టుపట్టించారు. కేటీఆర్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
రోజుకో మాట. పూటకో కామెంట్. ఏం మాట్లాడుతున్నాడో అని ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకునేలా. యదారాజా తథా ప్రజా అన్నట్టు కేసీఆర్, కేటీఆర్‌లే ఈ విధంగా ఉంటే.. చుట్టూ చేరిన భజన బ్యాచ్ ఇలా ఉండక ఎలా ఉంటారు. తమ తప్పులేమిటో తెలుసుకుని ప్రజలకు చేరువయ్యే మార్గం చూసుకోండ్రా నాయన అంటే.. ఇలా మాకు ఆ పదవి గడ్డిపరకతో సమానం. మీరే కొత్త బిచ్చగాళ్లు..సీఎం పదవి ఓ లెక్కా.. అనే రీతిలో మాట్లాడే మీ అహంకారపు మాటలు మిమ్మల్ని ఇంకా చాన్నాళ్లు ఫాం హౌజ్ కే పరిమితం చేస్తాయి. తప్పుడు. అవునూ.. ఇలాంటి పోస్టులు పెట్టి కేటీఆర్, కేసీఆర్‌లతో శభాష్ అనిపించుకోవాలనా మీ ఆరాటపోరాటం.. ఆ పెద్దలకు ఏం అర్ధమవుతుందో తెలియదు కానీ.. ప్రజలకు మాత్రం మా తీర్పు మీకు కర్రుకాల్చి వాత పెట్టినట్టేనట్టు కరెక్టేనని అనుకుంటున్నారు. ఇక మారండయ్యా.. నీకెందుకు మీమింతె బట్టలు చింపుకుంటామంటారా..! దానికి ఎవరేం చేస్తారు. అన్ని గమనిస్తారు.. మొన్నటిలా సమయం వచ్చినప్పుడు చిరిగిపోగా మిగిలిన బట్టలను ప్రజలు తొలగిస్తారు.