పాము గుడ్లు పెడుతుంది కాని, వాటిని పొదగదు, పిల్లల్ని పోషించదు.
రక్షణ ఉన్న తావున గుడ్లు పెట్టి మరచి పోతుంది.
వాతావరణ వేడికే గుడ్లు పొదిగి పిల్లలవతాయి.
గుడ్డు పెంకులో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి.
వాటిద్వారా పెరిగే పిండానికి ఆక్సిజన్ అందుతుంది.
గుడ్డులోని సొనలో పిండం పెరగడానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి.
పరిణామంలో గుడ్డు రూపొందడంతో నేలమీద జీవులు నిలదొక్కుకునే అవకాశం పెరిగింది.
ఉభయ చరాలైన కప్పల లాంటి జీవుల నుండి పరిణామంలో పాముల్లాంటి సరీ సృపాలు వచ్చాయి.
ఉభయ చరాలు నీటిలో గుడ్లు పెడతాయి.
పూర్తి కాలం నేల మీద జీవించాలంటే నేలీద పొదిగే గుడ్లు పెట్టాలి.
ఈ గుడ్లు రూపొందాయి కాబట్టే నేల మీదనే గుడ్లు పెట్టే సరీసృపాలు నేల మీద విజయం వంతంగా జీవిస్తున్నాయి.
*
పాములు పగ పట్ట లేవు.
గుడ్లను పెట్టి పొదిగి, పోషించలేని పాముకు పగ పట్టేందుకు అవసరమైన తెలివితేటలు లేవు.
సరీసృపాలైన పాముల మెదడు అంత శక్తి యుక్తులు కలది కాదు.
ఎవరైనా తోక మీద కాలు వేస్తే ఆ బాధలో వెంటనే ఆ కాలుని కాటువేయడం, విషం ఉంటే దాని ప్రభావం వల్ల మనిషి మృతి చెందడం మామూలే.
మనిషిని గుర్తుపెట్టుకుని, రెండు మూడు రోజులు వెంటాడి, కాటు వేసి చంపడం జరగదు.
వాటికి తమలో విషం ఉన్నట్లు కాని, ఆ విష ప్రభావం వల్ల మనిషి చస్తాడని కాని, తెలియదు.
పాములకు చెవులు పని చేయవు.
సంగీతం, పాటలు వినలేవు.
భూ కంపనాలను బట్టి అలికిడిని గుర్తిస్తాయి.
మంత్రాలతో అరచి గీ పెట్టినా, నాద స్వరం వాయించినా వాటికి వినపడదు.
పాములు పాలు తాగవు.
సరీసృపాలు పాలు తాగవు.
పుట్టల్లో పాలు పోస్తే మట్టి పాలే కాని, పాములకు అందవు.

– మేడూరి సత్యనారాయణ.

You missed