Category: Local News

సింగిల్ హ్యాండ్ మ‌హేశ్‌! ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించుకున్న పీసీసీ చీఫ్‌! అర్వింద్‌తో ఢీ అండే ఢీ అనే రేంజ్‌లో పోటాపోటీ! ప‌ట్టుబ‌ట్టి.. పోరాడి, ప్ర‌చారం చేసి.. మున్సిప‌ల్‌పై కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసిన మ‌హేశ్ కుమార్ గౌడ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్ నిజంగా అనాథే. అవును.. అధికార పార్టీ ఉన్నా.. ఇక్క‌డ అంతా హేమాహేమీలే ఉన్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోని అనాథే. ష‌బ్బీర్ అలీ ఉన్నాడు ఇంచార్జిగా. అత‌ను ద‌త్త‌పుత్రుడే ఇక్క‌డి వాళ్ల‌కు. కామారెడ్డికే ప‌రిమిత‌మైండు. సుద‌ర్శ‌న్‌రెడ్డి ఉన్నాడు. మంత్రికాని మంత్రి.…

కాంగ్రెస్ మేయ‌ర్‌ క్యాండిడేట్ ఓట‌మి..! బ్యాడ్‌ల‌క్ న‌రేంద‌ర్‌రెడ్డి!! మేయర్ పీఠం కాంగ్రెస్‌కే.. ఊపిరి పీల్చుకున్న మ‌హేశ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) మోదం.. ఖేదం..! రెండూ కాంగ్రెస్ చ‌విచూసింది నిజామాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో. తృటిలో మేయ‌ర్ పీఠం జార‌విడుచుకునే ప‌రిస్థితి వ‌స్తుండే. కానీ ఎంఐఎం మ‌ద్ద‌తుతో మేయర్ పీఠం గెలుచుకున్న‌ది. కానీ మేయ‌ర్ క్యాండిడేట్‌గా 19వ డివిజ‌న్ నుంచి బ‌రిలోకి…

త‌క్కువ పోలింగ్ ప‌ర్సెంటీజీ ఎవ‌రి కొంప ముంచుతుంది!? బీజేపీ గెలుపు ఆశ‌ల‌కు గండి? మంద‌కొడిగానే ఓటింగ్‌… నిజామాబాద్ అర్బ‌న్‌లో 60 శాతానికి మించ‌ని పోలింగ్‌.. ఇప్పుడు ఇది పెరుగుతుందా? త‌గ్గుతుందా?

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్‌లో ఎప్పుడూ అంతే. ఇక్క‌డ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎప్పుడూ 60 శాతానికి పోలింగ్ ప‌ర్సెంటేజీ దాట‌దు. మ‌రి ఇప్పుడు హోరాహోరీగా సాగుతున్న నిజామాబాద్ బ‌ల్దియాలో త‌గ్గే ఈ పోలింగ్ శాతం ఏ పార్టీ కొంప ముంచ‌నుంది?…

ట‌గ్ ఆఫ్ వార్‌! టార్గెట్ మేయర్ క్యాండిడేట్‌!! ఒక‌రి అభ్య‌ర్థిపై మ‌రొక‌రు అస్త్ర‌శ‌స్త్రాలు.. కాంగ్రెస్ అభ్య‌ర్థినికి డిపాజిట్లు రానీయొద్ద‌ని అర్వింద్ పిలుపు స్ర‌వంతి అస‌లు లోక‌లే కాదు… నాన్ లోక‌ల్ అంటూ కాంగ్రెస్ ప్ర‌చారం.. గెలిచినా ఆమె అక్క‌డ అందుబాటులో ఉండ‌ద‌ని విస్తృతంగా ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో ఇందూరు కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీ ఫైట్

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. చాలా ఏళ్ల త‌రువాత వ‌చ్చిన అవ‌కాశాన్ని జార విడుచుకోవ‌ద్ద‌ని అధికార పార్టీ గెలుపు కోసం అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. బీజేపీ మాత్రం కాంగ్రెస్ గెలుపు అవ‌కాశాల‌ను గండి కొట్టే విధంగా విస్తృత…

మేయ‌ర్ అభ్య‌ర్థికి అడుగ‌డుగునా స్వాగ‌తం! 19వ డివిజ‌న్‌లో కాట్ప‌ల్లి శ‌మంత న‌రేంద‌ర్‌రెడ్డి ఇంటింటి ప్ర‌చారం!! ఇంటి ఆడ‌బిడ్డ‌గా అక్కున చేర్చుకుంటున్న కాల‌నీ వాసులు.. భారీ మెజారిటీతో గెలిపించుకోవాల‌ని కోరిన అభ్య‌ర్థి.. మోడ‌ల్ డివిజ‌న్‌గా తీర్చిదిద్దుతాన‌ని హామీ

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన 19వ డివిజ‌న్ కాంగ్రెస్ అభ్య‌ర్థి కాట్ప‌ల్లి శ‌మంత న‌రేంద‌రెడ్డి గురువారం కాల‌నీల్లో విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇంటింటికీ వెళ్లి ఓట‌డిగారు. మోడ‌ల్ డివిజ‌న్‌గా తీర్చిదిద్దుతాన‌ని, భారీ మెజారిటీతో గెలిపించుకోవాల‌ని అభ్య‌ర్థించారు. త‌మ…

ఢీ అండే ఢీ సుద‌ర్శ‌న్‌రెడ్డికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ష‌కీల్‌! హ‌మీతుమీగా బోధ‌న్ బీఆరెస్ అధికార పార్టీపై అసంతృప్తి.. మాజీ మంత్రిపై కినుక‌.. ష‌కీల్‌కు క‌లిసి వ‌స్తున్న బోధ‌న్ రాజ‌కీయం.. స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారిన బోధ‌న్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు

బోధ‌న్‌- వాస్త‌వం ప్ర‌తినిధి: బోధ‌న్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు పెద్ద మ‌నిషికి పెద్ద త‌ల‌నొప్పినే తెచ్చిపెట్టాయి. అంత‌టా ఒక లెక్కైతే ఇక్క‌డ ఒక లెక్క‌గా మారింది ప‌రిస్థితి. ఇక్క‌డ అధికార పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, మాజీ మంత్రి సుద‌ర్శ‌న్‌రెడ్డి…

అధికార పార్టీతోనే అభివృద్ధి! మీతోనే ఉంటా…. స‌త్వ‌రం స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా…! 19వ డివిజ‌న్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కాట్ప‌ల్లి శ‌మంత న‌రేంద‌ర్‌రెడ్డిల ప్ర‌చారం నీల కంఠేశ్వ‌రాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు! ఇంటింటి ప్ర‌చారానికి మంచి స్పంద‌న‌.. తొలిరోజు ప్ర‌చారానికి ఆకుల ల‌లిత హాజ‌రు.. శ‌మంత‌ను గెలిపించుకోవాల‌ని.. అభివృద్ధికి బాట‌లు వేసుకోవాల‌ని పిలుపు..

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: రిటైర్డ్ టీచ‌ర్‌గా కాట్ప‌ల్లి శ‌మంతా అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఆమె భ‌ర్త న‌రేంద‌ర్‌రెడ్డి విద్యావేత్త‌, కాల‌నీలో త‌ల‌లో నాలుక‌లా ఆప‌ద‌లో నేనున్నానని ఆదుకునే మ‌న‌స్త‌త్వం ఉన్న నాయ‌కుడు. న‌గ‌రంలోని 19 వ డివిజ‌న్ నుంచి శ‌మంత న‌రేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్…

ఎవ‌రిదీ పాపం!? కోర్టు తీర్పును ఉల్లంఘించి.. ఆస్తిప‌న్ను!! ఇందూరు బ‌ల్దియాలో అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రి బ‌ట్ట‌బ‌య‌లు.. ఆస్తిప‌న్ను స‌కాలంలో చెల్లించినా.. వాస్త‌వాలు వెల్ల‌డించినా.. వైఖ‌రి మార్చుకోని అధికారులు.. చెల్లించిన ప‌న్నును అఫిషియ‌ల్ పోర్ట‌ల్‌లో ఎక్కించ‌ని వైనం.. బ‌కాయిలు, ఇంట్ర‌స్ట్ రూపంలో రూ. 8 కోట్ల‌ను చేర్చిన అధికారులు.. చ‌ర్చ‌కు వ‌చ్చిన ఆస్తిప‌న్ను చెల్లింపు అంశం.. దీన్ని రాజ‌కీయ అస్త్రంగా వాడుకునేందుకు ప్ర‌తిప‌క్షాల‌ య‌త్నం..!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఇందూరు మున్సిపాలిటీ ప‌రిధిలోని 19 వ డివిజ‌న్ కాంగ్రెస్ అభ్య‌ర్థి కాట్‌ప‌ల్లి శ‌మంత న‌రేందర్‌రెడ్డి వార్త‌ల్లో కేంద్ర బిందువ‌య్యారు. ఎందుకో మీ అంద‌రికీ తెలుసు. ఆమె బ‌కాయి ప‌డ్డ ఆస్తి ప‌న్ను రూ. 8 కోట్లు…

భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్న‌ క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు! అర్వింద్ ఒంటెత్తుపోక‌డ‌ల‌తో బీజేపీ క‌కావిక‌లం! డ‌బ్బులున్న‌వారికి, అర్వింద్‌కు అనుకూలురుకు మాత్ర‌మే టికెట్లు.. మ‌ర్యాద ద‌క్క‌లేదు.. గౌవ‌ర‌మూ లేదు.. అంతా క‌మ‌ర్శియ‌ల్‌.. ఇందూరు బీజేపీలో ఇదో న‌యాట్రెండ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇందూరు బీజేపీని ప‌ట్టుకుని ఇంకా వేలాడుతున్న క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు ఇప్పుడు భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్నారు. భాయ్‌సాబ్ అంటే ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌. తెలంగాణవాదం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో నిజామాబాద్ ఉప ఎన్నిక‌లో డీఎస్‌ను…

కేఆర్ సురేశ్‌రెడ్డి… వార‌సుడొస్తున్నాడు! కొడుకును ఆర్మూర్ బ‌రి నుంచి ఎంట్రీకి తండ్రి సుముఖ‌త‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ స్పీక‌ర్ కేఆర్ సురేశ్‌రెడ్డి .. త‌న వార‌స‌త్వాన్ని రాజ‌కీయాల్లోకి దింపుతున్నాడు. ఆయ‌న త‌న కొడుకు అమిత్‌రెడ్డిని ఆర్మూర్ బ‌రి నుంచి దింపేందుకు .. ఇక్క‌డి నుంచి రాజ‌కీయ ఆరంగేట్రం చేపించేందుకు పావులు క‌దుపుతున్నాడు. ఇప్ప‌టికే…