వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసు మరింత ముదిరింది. లొంగిపోయి బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన కొడుకు ఇష్యూను గెలికి మరీ పెద్దది చేసుకున్నాడు షకీల్. ఓ వీడియో రిలీజ్ చేసిన షకీల్ పోలీసులు పూర్తిగా తప్పుడు కేసు పెట్టి తన కొడుకును వేధించారని, ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆరోపించారు.
దీనిపై హైదరాబాద్ సీపీ ఘాటుగా స్పందించాడు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు షకీల్ ప్రయత్నిస్తున్నాడని, చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ అంశం బోధన్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. మరోవైపు ఇదే కేసులో షకీల్ కొడుకును కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇచ్చి ముడుపులు స్వీకరించిన బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ సస్పెన్షన్ వేటు పడింది.
ఈ సంఘటనతో ప్రభుత్వం షకీల్ కొడుకు కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో మునిగి ఉన్న షకీల్ తన కొడుకు యాక్సిడెంట్ కేసును గెలికి మరింత జఠిలం చేసుకున్నాడు. ఇది రాజకీయంగా బీఆరెస్‌కు లబ్ది చే్కూరుతుందని ఎవరిచ్చారో సలహాగానీ ఇది షకీల్ మెడకు మరింత ఉచ్చును బిగించింది.