దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

నిజామాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్టోగ్రతలు. బయట అడుగు పెడతామంటే ప్రాణాలు తోడేసే భగభగలు. నిప్పుల కుంపటిని రాజేస్తున్న భానుడు.. పార్లమెంటు ఎన్నికల వేళ ఇద్దరి సీనియర్లకు ఈ వాతావరణం ప్రాణగండంగా మారింది. బీఆరెస్‌ నిజామాబాద్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిలకు ఈ ఎన్నికల ప్రచారం ముచ్చెమటలు పట్టిస్తున్నది. మాములుగా పోటీ తవ్రంగా ఉంటే ముచ్చెమటలు అనే పదం వాడుతాం.

కానీ ఇక్కడ ప్రచారమే ప్రాణాలు తోడేస్తన్నది. ఇద్దరి వయస్సు ఎక్కువే. దీంతో వీరికి అనారోగ్య సమస్యలకు తోడు ఎర్రటి ఎండలు కూడా తోడై నిజంగానే ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖాలు వాడిపోయి.. రోజు ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు.. ఎడతెరిపి లేకుండా ప్రచారం.. ఎన్నికలు ఓ వైపు ముంచుకొస్తున్న వేళ మరింతగా ప్రచారం దూకుడు పెంచాల్సిన అనివార్యత అన్నీ కలిసి ఈ ఇద్దరికీ ఇదో సవాలుగా మారింది.

అయ్యో.. పాపం..! అని వీరిని చూసిన జనాలు అనుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎవరు గెలుస్తారో.. ఎవరోడుతారో.. ఎవరికి ఈ సానుభూతి కలిసొస్తుందో తెలియదు కానీ.. పెద్ద మనుషులిద్దరూ చమటోడుస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

 

You missed