దండుగుల శ్రీనివాస్‌ వాస్తవం ప్రధాన ప్రతినిధి:

పగ పగే. చాలెంజ్‌ చాలెంజే. చాలెంజ్‌ చేసిందెవరు..? కేసీఆర్‌ కూతరు. ఏమని చాలెంజ్‌ చేసింది..? బిడ్డా నువ్వేడనుంచి పోటీ చేసినా నిన్ను ఓడించి తీరుతా. అవును.. ఆమె పంతం అంటే పంతమే. పగ అంటే పగే. కోరుట్ల నుంచి అర్వింద్ అసెంబ్లీకి పోటీ చేస్తే కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగి తిరిగి ఖర్చు చేసి శ్రమకోర్చి ఓడించింది. మరి ఇప్పుడు…? ఎంపీగా చేస్తున్నాడు. ఆమె లేదు. జైలులో ఉంది. మరి ఎలా ఆమె ఓడించగలదు..? కానీ అందరికీ తెలియని విషయమేమిటంటే..

ఆమె జైలు నుంచి వ్యూహ రచన మొదలు పెట్టింది. అర్వింద్‌ను తుక్కు తుక్కు కింద ఓడగొట్టేందుకు. అంతే ఎక్కడున్నా పగ పగే. చాలెంజ్‌ చాలెంజే. రాజకీయ క్రీడ అంటే అంతే మరి. ఇది ఇందూరు రాజకీయ కబ్జా కబాడీ ఆట. మొన్నటి వరకు ఆమెదే ఇక్కడ రాజ్యం. ఆమె లేకుండా జిల్లా రాజకీయాలను ఊహించడం కష్టం. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు. కాలక్రమేణా తన ఉనికి క్రమంగా కోల్పోయిందామె. అది ఆమె స్వయంకృతాపరాధమే. అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆమెకు కూడా అది తెలుసు. కానీ ఆత్మవంచనే వారి మార్గం. సమర్థింపే వారికి అలవాటు దోరణి. ఇప్పుడు అది కాదు ముచ్చట. అర్వింద్‌ను ఓడగొట్టి కవిత సత్తా చాటాలి. జైలు ఉన్నా.. ఎక్కడో అండమాన్‌లో బంధించినా…

కవిత జైలు నుంచే రివెంజ్ పాలిటిక్స్ మొదలు పెట్టింది. అరవింద్ మీద ఆమె విసిరిన ఛాలెంజ్ నిరూపించుకునేలా వ్యూహ రచన చేస్తోంది. తన టీమ్ ను నిజామాబాద్ లోకసభ బరిలో దింపింది. అరవింద్ వైఫల్యాలు, వ్యక్తిగతంగా వచ్చిన వ్యతిరేకత, అహంకార ధోరణి.. వీటిని ఆయుధాలుగా చేసుకొని అరవింద్ ను చిత్తు చిత్తు గా ఓడగొట్టేందుకు జైలు నుంచే వ్యూహ రచన చేస్తోంది. బాజిరెడ్డిని గెలిపించుకోవడం తో పాటు అరవింద్ పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం గా ఆమె పావులు కదుపుతుంది.

ఇప్పటికే ఆమె జైలు నుంచే తన టీం కు దిశా నిర్దేశము చేసి వున్నారు. Ktr తో కూడా ఈ విషయం పై సుదీర్ఘంగా చర్చించారు.గత కొద్ది రోజులుగా ఇదే పని మీద కవిత టీం సీరియస్ గా పనిచేస్తోంది. ఇందూర్ రాజకీయాలు ఈ ఉదంతం తో మరింత వేడెక్కాయి… నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడుతున్న ముగ్గురు అభ్యర్థులకు తోడు కవిత స్థానికంగా అందుబాటులో లేకున్నా జైలు నుంచే కథ నడిపిస్తోంది.

You missed